బెడిసికొట్టిన బీజేపీ వ్యూహం.. కొంత రిలీఫ్‌ | Sakshi
Sakshi News home page

బెడిసికొట్టిన బీజేపీ వ్యూహం.. కొంత రిలీఫ్‌

Published Fri, May 26 2017 5:27 PM

బెడిసికొట్టిన బీజేపీ వ్యూహం.. కొంత రిలీఫ్‌ - Sakshi

మాలేగావ్‌: బీజేపీ వ్యూహాం బెడిసికొట్టింది. అయితే, గతంలో కంటే కొంత మెరుగైన ఫలితాలు రావడంతో మొత్తానికి నష్టపోవడం కంటే ఎంతోకొంత మిగలడం సంతోషకరం అని భావించి బీజేపీ శ్రేణులు  ఆ తేలికపాటి విజయానికి పండగ చేసుకుంటున్నారు. మహారాష్ట్రలోని ముస్లింల డామినేషన్‌ ఎక్కువగా ఉండే మాలేగావ్‌ కార్పొరేషన్‌ను దక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా 27మంది ముస్లిం అభ్యర్థులను బీజేపీ నిలబెట్టింది. అయితే, వారిలో ఏ ఒక్కరు కూడా విజయాన్ని సాధించలేదు.

అయితే, ముస్లింయేతర అభ్యర్థులను నిలబెట్టిన కొన్ని చోట్లలో మొత్తం ఏడు వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఐదేళ్ల కిందట కనీసం ఒక్క వార్డు కూడా గెలుచుకోని ఆ పార్టీ ప్రస్తుతం ఏడు వార్డులు గెలుచుకోవడంతో సంబురాల్లో మునిగిపోయింది. మాలేగావ్‌ కార్పొరేషన్‌లో మొత్తం 84 వార్డులు ఉన్నాయి. అందులో కాంగ్రెస్‌ పార్టీకి 28 వార్డులు రాగా, ఎన్సీపీకి 20, బీజేపీకి 7, మిగితావి ఇతర పార్టీలకు దక్కాయి. మొత్తానికి మాలేగావ్‌ కార్పొరేషన్‌లో బీజేపీ మూడో స్థానంలో నిలిచింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement