30 ఏళ్ల తర్వాత భారత అమ్ములపొదిలోకి.. | Sakshi
Sakshi News home page

30 ఏళ్ల తర్వాత భారత అమ్ములపొదిలోకి..

Published Thu, May 18 2017 1:26 PM

30 ఏళ్ల తర్వాత భారత అమ్ములపొదిలోకి..

న్యూఢిల్లీ: ఎట్టకేలకు 30 ఏళ్ల తర్వాత భారత అమ్ములపొదిలోకి కొత్త శతఘ్నులు చేరాయి. ఎత్తయిన కొండ ప్రాంతాల్లోని శత్రువులను ఢీకొట్టే సామర్థ్యం ఉన్న వీటిని గత ఏడాది కేంద్రం తీసుకున్న నిర్ణయంలో భాగంగా అమెరికా నుంచి కొనుగోలు చేశారు. మొత్తం 145 శతఘ్నులను కొనుగోలు చేయగా వాటిల్లో రెండు నేడు భారత్‌కు చేరుకున్నాయి. ఇవి దాదాపు 30 కిలో మీటర్ల లక్ష్యాన్ని సైతం అవి తుత్తునీయలు చేస్తాయి.

రెండు ఎం-777 ఆల్ట్రా-లైట్‌ హొవిట్జర్‌ ఆయుధాలు నేడు భారత్‌కు చేరుకున్నట్లు భారత ఆర్మీ ప్రతినిధులు ఒక ప్రకటనలో చెప్పారు. 1980లో తొలిసారి స్వీడన్‌ నుంచి బొఫోర్స్‌ శతఘ్నులను కొనుగోలు చేసిన భారత్‌ ఆ తర్వాత వీటిని తిరిగి ఆర్మీలోకి తీసుకోలేదు. భారత ఆర్మీ తన ఆయుధ సంపత్తిని మరింత పెంచుకునేందుకు వీటిని కొనుగోలు చేసేందుకు నిర్ణయించుకోని కేంద్రానికి ప్రతిపాదన చేయగా గత ఏడాది జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో వీటి కొనుగోలుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దీంతో అమెరికాతో మొత్తం 700 మిలియన్‌ డాలర్లతో ఈ ఆయుధాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది.



Advertisement

తప్పక చదవండి

Advertisement