అందరికీ ఆరోగ్యమే లక్ష్యం | Sakshi
Sakshi News home page

అందరికీ ఆరోగ్యమే లక్ష్యం

Published Fri, Jul 11 2014 2:50 AM

అందరికీ ఆరోగ్యమే లక్ష్యం - Sakshi

 బడ్జెట్‌లో రూ.39,237 కోట్లు
 
న్యూఢిల్లీ: అందరికీ ఆరోగ్యమే లక్ష్యంగా అందరికీ ఉచిత రోగ నిర్ధారణ పరీక్షలు, ఉచిత మందులు అందిస్తామని కేంద్ర ప్రభుత్వం 2014-15 బడ్జెట్‌లో హామీ ఇచ్చింది. ఈ లక్ష్యసాధనకోసం ఆంధ్రప్రదేశ్‌తోపాటు పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలోని విదర్భ, ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్‌లో రూ.500 కోట్ల వ్యయంతో మరో నాలుగు ఎయిమ్స్ తరహా సంస్థలు ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు.

ఆరోగ్య రంగానికి యూపీఏ ప్రభుత్వం గత బడ్జెట్‌లో రూ.37,330 కోట్లు కేటాయించగా, తాము ఐదుశాతం పెంచి మొత్తంగా రూ.39,237.82కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇందులో రూ.21,912కోట్లు జాతీయ ఆరోగ్య మిషన్‌కు కేటాయించారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగానికి రూ. 8426 కోట్లు, ఆయుష్ విభాగానికి రూ. 689 కోట్లు, వైద్యపరిశోధనకు రూ. 726 కోట్లు, ఎయిడ్స్ నియంత్రణకు రూ. 857 కోట్లు కేటాయించారు.
 
 గ్రామీణ భారతంలో అత్యుత్తమ ఆరోగ్య సేవలందించేందుకు 15 ఆదర్శ గ్రామీణ వైద్య పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు జైట్లీ తన తొలి బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. స్థానిక ఆరోగ్య సమస్యలపై ఈ కేంద్రాలు పరిశోధనలు జరపడంతోపాటు అన్ని రకాల సేవలు అందిస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం 58 ప్రభుత్వ వైద్య కళాశాలలున్నాయని, త్వరలో మరో 12 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ఈ కొత్త కళాశాలల్లో దంతవైద్య సేవలు కూడా అందిస్తారని చెప్పారు. వృద్ధుల్లో టీబీ వ్యాధిని తొలి దశలోనే గుర్తించేందుకు ఢిల్లీ, చెన్నైల్లోని ఎయిమ్స్‌లలో రెండు జాతీయ వృద్ధుల సంస్థలు నెలకొల్పనున్నట్లు ప్రకటించారు. అలాగే దంతవైద్యంలో ఉన్నత విద్యకోసం ఒక జాతీయ స్థాయి పరిశోధన, రిఫరల్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కేంద్రం తొలిసారిగా కొత్త ఔషధ పరీక్ష కేంద్రాలను నెలకొల్పడంద్వారా రాష్ట్రాల్లో ఔషధ, ఆహార నియంత్రణ వ్యవస్థలను బలోపేతం చేస్తామని చెప్పారు.
 
  హైలైట్స్
 

     {దవ్యలోటు లక్ష్యం ప్రస్తుత ఏడాదికి జీడీపీలో 4.1 శాతం. 2015-16 ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో 3.6 శాతంగా నిర్ణయం

పెద్ద నగరాల్లో మహిళల భద్రత పెంపునకు రూ. 150 కోట్లు
ఎల్‌సీడీ, ఎల్‌ఈడీ టీవీలు మరింత చౌక
సిగరెట్లు, పాన్ మసాలా, టొబాకో, కూల్‌డ్రింక్‌లు ప్రియం
రూ. 500 నుంచి రూ.1,000 ఖరీదు చేసే పాదరక్షలపై ఎక్సైజ్ సుంకం 12 శాతం నుంచి 6 శాతానికి తగ్గింపు
హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, బీహార్, ఒడిశా, రాజస్థాన్‌లలో 5 ఐఐఎంల ఏర్పాటు
*   ఆంధ్రప్రదేశ్, జమ్మూ, చండీగఢ్, గోవా, కేరళల్లో 5 ఐఐటీల ఏర్పాటు
పట్టణ పేదలు / ఈడబ్ల్యూఎస్ / ఎల్‌ఐజీ విభాగంలో అందుబాటులో గృహ నిర్మాణం కోసం తక్కువ వడ్డీకి రుణాలు పెంపొందించేందుకు రూ. 4,000 కోట్లు
* గంగా నదిపై ‘జల్ మార్గ్ వికాస్’ పథకం పేరుతో అలహాబాద్ నుంచి హల్దియా వరకూ అంతర్గత జలమార్గాల కోసం రూ. 4,200 కోట్లు గ్రామాలు, పాఠశాలల్లో సేవలు, ఐటీ నైపుణ్యాల్లో శిక్షణ కోసం జాతీయ గ్రామీణ ఇంటర్నెట్ అండ్ టెక్నాలజీ కార్యక్రమం
లక్నో, అహ్మదాబాద్‌లలో మెట్రో ప్రాజెక్టుల కోసం రూ. 100 కోట్లు
యుద్ధ ప్రదర్శనశాల, యుద్ధ స్మారకం ఏర్పాటుకు రూ. 100 కోట్లు
రూ. 500 కోట్ల నిధితో పండిట్ మదన్‌మోహన్ మాలవీయ నూతన ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం
నిర్వాసిత కాశ్మీరీ వలసల పునరావాసానికి రూ. 500 కోట్లు
*   దాదాపు 600 కొత్త, ప్రస్తుత కమ్యూనిటీ రేడియో స్టేషన్లకు మద్దతుగా రూ. 100 కోట్లతో పథకం
సేంద్రియ వ్యవసాయం అభివృద్ధికి రూ. 100 కోట్లు
కిసాన్ వికాస్ పత్రాల పునఃప్రవేశం, బీమా సదుపాయంతో కూడిన జాతీయ పొదుపు ధురవీకరణపత్రాల ప్రారంభం
అల్ట్రా మోడర్న్ సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ టెక్నాలజీ ప్రతిపాదన
{పభుత్వ రంగ బ్యాంకుల మూలధనం కోసం రూ. 11,200 కోట్లు
పత్యక్ష పన్నుల ప్రతిపాదనల ఫలితంగా రూ.22,200 కోట్ల
 ఆదాయ నష్టం
పన్నుల ద్వారా రూ. 9.77 లక్షల కోట్ల ఆదాయం అంచనా
* పరోక్ష పన్నుల ప్రతిపాదనల ద్వారా రూ.7,525 కోట్ల ఆదాయం

Advertisement
Advertisement