‘భద్ర’తో పెట్టుకున్నారు, 4లక్షల జరిమానా కట్టారు | Sakshi
Sakshi News home page

‘భద్ర’తో పెట్టుకున్నారు, 4లక్షల జరిమానా కట్టారు

Published Tue, Sep 13 2016 8:51 AM

‘భద్ర’తో పెట్టుకున్నారు, 4లక్షల జరిమానా కట్టారు - Sakshi

చెన్నై: వీధికుక్కపై రాక్షసంగా ప్రవర్తించిన ఇద్దరు వైద్య విద్యార్థులు రూ.4 లక్షలు జరిమానా చెల్లించుకున్నారు. చెన్నై కున్రత్తూరుకు చెందిన  సుదర్శన్, ఆశిష్ ఆరు నెలల కిందట వీధికుక్కను మూడో అంతస్తు నుంచి కిందకు విసిరివేశారు. వీడియో తీసి స్నేహితులతో షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. అంతేగాక ఈ దృశ్యాన్ని వాట్సాప్‌లో పెట్టి పలువురికి తమ ఘనతను చాటుకున్నారు. ఆరు నెలల క్రితం చోటుచేసుకున్న ఈ సంఘటన పెద్ద ఎత్తున కలకలం సృష్టించింది. జంతుసంక్షేమ సంఘం ప్రతినిధి ఆంథోనీ సదరు మెడికోలను గుర్తించి శిక్షించాల్సిందిగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఇద్దరు మెడికోలు శ్రీపెరంబుదూరు న్యాయస్థానంలో లొంగిపోయారు. వీరిద్దరినీ మెడికల్ కళాశాల యాజమాన్యం సస్పెండ్ చేసింది.

మరోవైపు గాయపడిన కుక్కకు ‘భద్ర’అని పేరుపెట్టి జంతు ప్రేమికులు చికిత్స అందించారు. వైద్యానికి అయిన ఖర్చు, అపరాధ రుసుం కలిపి తలా రూ.2 లక్షలను జంతు సంరక్షణ కేంద్రానికి చెల్లించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. జరిమానా చెల్లించడంతో మెడికోల సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దు చేసి అడ్మిషన్ కల్పించాల్సిందిగా వైద్యకళాశాల యాజమాన్యాన్ని హైకోర్టు సోమవారం ఆదేశించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement