తెలుగు రాష్ట్రాల్లో 8 ఐఆర్ బెటాలియన్లు | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాల్లో 8 ఐఆర్ బెటాలియన్లు

Published Thu, Nov 20 2014 2:23 AM

8 IR battalions in Andhra pradesh, telangana

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విడతలవారీగా ఎనిమిది ఇండియన్ రిజర్వ్(ఐఆర్) బెటాలియన్లు ఏర్పాటు చేసేందుకు కేంద్రం నిర్ణయించింది. సంబంధిత ఫైలుకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ బుధవారం ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో నిర్దేశించిన విధంగా రెండు రాష్ట్రాలు పోలీసు బలగాలను సమకూర్చుకునేందుకు కేంద్రం సాయం చేయాల్సి ఉంది. దానిలో భాగంగానే వీటిని ఏర్పాటు చేయనున్నట్టు హోంశాఖ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండు బెటాలియన్లు, వచ్చే రెండేళ్లలో ఏటా ఒక్కో బెటాలియన్ చొప్పున రెండు రాష్ట్రాలకూ విడివిడిగా ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర హోంశాఖ వెల్లడించింది.
 

Advertisement
Advertisement