వాళ్లంతా బెంగళూరుకు ఎందుకు వచ్చారో తెలుసా? | Sakshi
Sakshi News home page

వాళ్లంతా బెంగళూరుకు ఎందుకు వచ్చారో తెలుసా?

Published Fri, May 27 2016 9:29 AM

వాళ్లంతా బెంగళూరుకు ఎందుకు వచ్చారో తెలుసా? - Sakshi

బెంగళూరు: వైద్యం కోసం ఎక్కువ మంది విదేశీయులు ఆశ్రయిస్తున్న నగరంగా బెంగళూరు రికార్డుల్లోకెక్కింది. 2014 జనవరి నుంచి ఇప్పటివరకు చేసిన సర్వేలో ప్రపంచ దేశాల నుంచి బెంగళూరుకు వచ్చిన వారిలో 88,020 మంది వైద్యం కోసం వచ్చినట్లు వెల్లడి అయిది. బెంగళూరులో  ఆసుపత్రుల్లో రికార్డులను పరిశీలించి ఈ లెక్కలను వేసినట్లు సర్వేయర్లు తెలిపారు.

ఎక్కువమంది రోగులు క్యాన్సర్, ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్, కార్డియాక్ కేర్, నెఫ్రాలజీ, యూరాలజీ, న్యూరో సర్జరీ, ఆర్ధో పెడిక్స్ చికిత్సల కోసం బంగ్లాదేశ్, ఇరాక్, యెమన్, మాల్దీవులు, ఒమన్, మారిషస్, టాంజేనియా, కెన్యా, నైజీరియా, ఇండోనేసియాల నుంచి వస్తున్నట్లు రికార్డులు చెప్తున్నాయి. భారత్ లో అదీ బెంగళూరులో వైద్యం చౌకగా లభిస్తుండటంతో వీరందరూ తరలివస్తున్నట్లు తెలుస్తోంది.

విదేశీ రోగులు గత రెండేళ్లలో  అత్యధికంగా 49,000 మంది మణిపాల్ ఆసుపత్రిలో చేరారు. మణిపాల్ హస్పిటల్ సీఈవో డా.అజయ్ భక్షి మాట్లాడుతూ భారత్ లో మెడికల్ టూరిజం క్రమంగా ఎదుగుతోందని అన్నారు. ప్రస్తుతం మెడికల్ టూరిజంలో ప్రపంచలో మూడో స్థానంలో ఉన్నట్లు వివరించారు. ఈ అభివృద్ధి కొనసాగాలంటే విదేశాల నుంచి వచ్చే రోగులకు సౌకర్యాలు, వసతులను పెంచాలని అన్నారు.

ఇతర దేశాలతో పోలిస్తే బెంగళూరులో పది శాతం వైద్యఖర్చులు తగ్గుతున్నాయని అందుకే అంతర్జాతీయ రోగులు భారత్ వైపు మొగ్గు చూపుతున్నట్లు మజుందార్ షా మెడికల్ సెంటర్ డా. సునీల్ భట్ తెలిపారు. యూఎస్, సింగపూర్, యూరప్ దేశాలతో పోల్చితే వైద్యుల కేరింగ్, నిపుణతలో ముందున్న డాక్టర్లు బెంగళూరులో ఉంటున్నట్లు వివరించారు.

కొన్ని దశాబ్దాల నుంచి భారత్ లో డాక్టర్ల నిపుణతో పెరుగుతూ వస్తోందనీ చెప్పారు. మజుందార్ షా మెడికల్ సెంటర్ మణిపాల్ తర్వాత 10,000 మంది విదేశీయులకు చికిత్స అందించి రెండో స్థానంలో కొనసాగుతోంది. కొలంబియా ఆసియా ఆసుపత్రి, ఫోర్టిస్ ఆసుపత్రులు విదేశీయులకు చక్కని వైద్యాన్ని అందిస్తున్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement