కంఠనాథ్ ఆలయంలో తొక్కిసలాట, 9మంది మృతి | Sakshi
Sakshi News home page

కంఠనాథ్ ఆలయంలో తొక్కిసలాట, 9మంది మృతి

Published Mon, Aug 25 2014 8:09 AM

9 killed,several injured in stampede at kamtanath temple

మధ్యప్రదేశ్ : మధ్యప్రదేశ్‌ చిత్రకూట్ ప్రాంతంలోని కంఠానాథ్ ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో తొమ్మిదిమంది మృతి చెందారు. పలువురికి గాయాలైయాయి. సాత్నా జిల్లాలోని కంఠనాథ్ ఆలయం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. హిందూ పురాణాల ప్రకారం శ్రీరాముడు ఈ ప్రాంతంలో రాక్షసులను సంహరించాడని అంటారు.

అమావాస్య కావడంతో ఒక్కసారిగా  భక్తులు భారీగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగిందని ప్రాధమిక సమాచారం.  మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలను మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. జరిగిన ఘటనపై వెంటనే దర్యాప్తునకు ఆదేశించింది. సాత్నా జిల్లా అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి చక్కదిద్దుతున్నారు. గాయపడిన వారికి సమీప ఆస్పత్రిల్లో చికిత్సనందిస్తున్నారు.

Advertisement
Advertisement