హాస్యనటునికి రూ.5.90 కోట్ల నష్టపరిహారం | Sakshi
Sakshi News home page

హాస్యనటునికి రూ.5.90 కోట్ల నష్టపరిహారం

Published Sat, Dec 6 2014 10:11 PM

జగతి శ్రీకుమార్

 తిరువనంతపురం: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చక్రాల కుర్చీకే పరిమితమైన ప్రముఖ మలయాళ హాస్యనటుడు జగతి శ్రీకుమార్ కు ఓ ప్రై వేటు బీమా కంపెనీ 5 కోట్ల 90 లక్షల రూపాయల భారీ నష్టపరిహారం అందించింది. లోక్ అదాలత్ తో  కుదిరిన ఒప్పందం మేరకు కంపెనీ అధికారులు శనివారం శ్రీకుమార్ నివాసంలో సంబంధిత పత్రాలు అందించారు. 63 సంవత్సరాల వయసు గల శ్రీకుమార్ 1980 నుంచి 1500కుపైగా చ్రితాల్లో నటించారు.  హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆయన మలయాళ ప్రేక్షకులలో సుస్థిర స్థానం  సంపాదించారు.

 2012 మార్చిలో కర్ణాటకలోని కొడగు గ్రామంలో ఓ సినిమా షూటింగ్లో పాల్గొని కారులో తిరిగి వస్తుండగా, కొజిక్కోడ్ వద్ద జరిగిన ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. తమిళనాడులోని కోజికోడ్, వెల్లూరులలో ఆయన దీర్ఘకాలం చికిత్స చేయించుకున్న అనంతరం కోలుకున్నారు. అయితే శ్రీకుమార్ ప్రస్తుతం వీల్చైర్కే పరిమితమయ్యారు. ఈ ప్రమాదం వల్ల ఆయన తన నటజీవితానికి స్వస్తి పలకవలసి వచ్చింది.
**

Advertisement
Advertisement