Sakshi News home page

19 సార్లు పాజిటివ్ త‌ర్వాత కోలుకున్న మ‌హిళ‌

Published Fri, Apr 24 2020 4:20 PM

After 19 Coronavirus Tests And 45 Days Kerala Women Tests Negative - Sakshi

తిరువ‌నంత‌పురం : 19 సార్లు క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన మ‌హిళ‌ కరోనా నుంచి కోలుకుంది. తాజాగా నిర్వ‌హించిన రెండు ప‌రీక్ష‌ల్లో నెగెటివ్ రావ‌డంతో త్వ‌ర‌లోనే ఆమెను డిశ్చార్జ్ చేయ‌నున్న‌ట్లు ఆసుప‌త్రి వ‌ర్గాలు పేర్కొన్నాయి. కేర‌ళలోని ప‌త‌న‌మిట్ట ప్రాంతానికి చెందిన 62 ఏళ్ల మ‌హిళ కుటుంబస‌భ్యులు ఇట‌లీకి వెళ్లివ‌చ్చారు. ఆ త‌ర్వాత ఎప్ప‌టిలాగానే అనేక కార్య‌క్ర‌మాల‌కు హాజ‌ర‌య్యారు. మార్చి 10న వారికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా క‌రోనా సోకిన‌ట్లు తేలింది. దీంతో కుటుంబం మొత్తాన్ని క్వారంటైన్‌లోకి త‌ర‌లించి చికిత్స అందించారు. (19 సార్లు క‌రోనా పాజిటివ్‌..కానీ ల‌క్షణాలు లేవు)

రెండు వారాల క్రితం వారంద‌రికీ నెగెటివ్ రావ‌డంతో ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అయితే అప్ప‌టికే వారితో స‌న్నిహితంగా మెలిగిన వారికి సైతం క‌రోనా సోక‌గా అందులో 93 ఏళ్ల వృద్ధుడితోపాటు 88 ఏళ్ల బామ్మ కూడా క‌రోనా నుంచి కోలుకున్నారు. కానీ ఈమె ఒక్క‌రికే త‌ర‌చూ పాజిటివ్ అని తేలడంతో ఆసుప‌త్రిలోనే ఉండిపోయింది. 45 రోజుల పోరాటం అనంత‌రం ఎట్ట‌కేల‌కు క‌రోనాను జ‌యించింది. ఇదిలా వుండ‌గా కొంత‌మందిలో ఆల‌స్యంగా వైర‌స్ బ‌య‌ట‌పడుతుండ‌టంతో కేర‌ళ‌లో క్వారంటైన్ గ‌డుపును 28 రోజుల‌కు పొడిగించిన సంగ‌తి తెలిసిందే. (నెల జీతం క‌ట్‌..వారికి మిన‌హాయింపు)

Advertisement
Advertisement