ఆ తర్వాతే అభినందన్‌ విధుల్లోకి | Sakshi
Sakshi News home page

ఆ తర్వాతే అభినందన్‌ విధుల్లోకి

Published Mon, Mar 4 2019 3:36 PM

After That Abhinandan Will Fly Fighter Jet Says BS Dhanoa - Sakshi

న్యూఢిల్లీ : పాక్‌ చెర నుంచి విడుదలైన భారత వాయుసేన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ ఆరోగ్యం కుదుటపడిన వెంటనే ఐఏఎఫ్ కంబాట్ పైలట్‌గా బాధ్యతలు చేపడతారని భారత వాయుసేన (ఐఏఎఫ్‌) చీఫ్‌ బీఎస్‌ ధనోవా తెలిపారు. ఫైలట్‌ ఫిట్‌నెస్‌కు సంబంధించిన విషయంలో రెండో ఆలోచన లేదన్నారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్నపుడే అభినందన్‌ని విధుల్లోకి తీసుకోవటం జరుగుతుందని తేల్చిచెప్పారు. ప్రస్తుతం ఆయనకు ఆర్మీ ఆసుపత్రిలో నిపుణులైన వైద్యుల బృందం ఆధ్వర్యంలో  వైద్యపరీక్షలు జరుగుతున్నాయి. అయితే కొద్దిరోజుల క్రితం సర్జికల్‌ స్ట్రైక్స్‌తో ఉలిక్కిపడ్డ పాకిస్తాన్‌ భారత్‌పై వైమానిక దాడులకు దిగిన సంగతి తెలిసిందే.

పాక్‌కు చెందిన ఎఫ్‌-16 యుద్ధవిమానాలు గత బుధవారం నియంత్రణ రేఖ (ఎల్వోసీ) దాటి భారత గగనతలంలోకి ప్రవేశించగా.. అభినందన్‌ వర్ధమాన్‌ ఆర్‌-73 అనే మిస్సైల్‌ ప్రయోగించి ఓ యుద్ధవిమానాన్ని కూల్చేశారు. అదే సమయంలో అభినందన్‌ విమానం కూడా ప్రత్యర్థి దాడిలో నేలకూలింది. దాంతో ఆయన ప్యారాచూట్‌ సాయంతో పాక్‌ భూభాగంలో దిగాల్సి వచ్చింది. అప్పుడు కొందరు పాకిస్తాన్‌ ప్రజలు ఆయనపై దాడి చేశారు. ఈ దాడిలో అభినందన్‌ ప్రక్కటెముకతో పాటు పలుచోట్ల గాయాలయ్యాయి. కొద్ది సేపటి తర్వాత పాక్‌ ఆర్మీ ఆయన్ని వారినుంచి రక్షించి యుద్ధ ఖైదీగా వెంట తీసుకెళ్లింది. 

Advertisement
Advertisement