లోపాలున్నా కొత్త 500 నోటు చెల్లుతుంది: ఆర్‌బీఐ | Sakshi
Sakshi News home page

లోపాలున్నా కొత్త 500 నోటు చెల్లుతుంది: ఆర్‌బీఐ

Published Sat, Nov 26 2016 1:33 AM

లోపాలున్నా కొత్త 500 నోటు చెల్లుతుంది: ఆర్‌బీఐ

న్యూఢిల్లీ: ముద్రణ సమస్యల వల్ల కొన్ని కొత్త రూ. 500 నోట్లు గందరగోళం సృష్టిస్తున్నాయి. నగదు కొరత నేపథ్యంలో త్వరగా ముద్రించాలనే తొందరలో కొన్ని నోట్లలో తప్పులు దొర్లాయని ఆర్‌బీఐ ప్రకటించింది. ఇవి చెల్లుబాటు అవుతాయా? లేదా? .. అసలా? నకిలీయా? అన్న సందేహం నేపథ్యంలో ఆ నోట్లు చెల్లుతాయని తెలిపింది. కొన్ని నోట్లపై మహాత్మా గాంధీ ముఖంపై నీడలా మరో ముఖం కనిపించడం, నోటు మధ్యలో ఉండే సెక్యూరిటీ దారం పక్కకు జరగడం, సింహం గుర్తుతో ఉండే అశోక చక్ర స్తూపం వేరే చోట ఉండడం వంటి తప్పులు దొర్లారుు. ఈ నోట్లు చెల్లుతాయని, వీటిని ఉపయోగించుకోవచ్చని ఆర్‌బీఐ పేర్కొంది. ఇబ్బంది అనిపిస్తే బ్యాంకుల్లో మార్పుకోవచ్చని ప్రకటించింది.

ఆర్‌బీఐలో మార్చుకోవచ్చు
రద్దరుున పెద్దనోట్లను తమ కౌంటర్లలో మార్చుకోవచ్చని ఆర్‌బీఐ తెలిపింది. పాత రూ. 500, 1000 నోట్ల మార్పిడిని బ్యాంకుల్లో నిలిపేస్తున్నామని, అలాంటి నగదును బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోవాలని ప్రభుత్వం చెప్పడం తెలిసిందే. ‘రద్దరుున నోట్లను మార్చుకునే సౌకర్యం ఆర్‌బీఐ కౌంటర్లలో కొనసాగుతుంది ’అని పేర్కొంది.

24 వేల విత్‌డ్రాకు అనుమతించండి: ఆర్‌బీఐ  
ముంబై: తదుపరి ఉత్తర్వుల జారీ వరకూ బ్యాంకు ఖాతా నుంచి వారానికి రూ. 24 వేలు విత్‌డ్రా పరిమితి కొనసాగుతుందని ఆర్‌బీఐ శుక్రవారం తెలిపింది. ఏటీఎంల నుంచి తీసుకొనే నగదు కూడా ఈ పరిమితికి లోబడే ఉంటుందని పేర్కొంది. తమ ఖాతాదారులు వారానికి రూ. 24 వేలు తీసుకునేలా బ్యాంకులు అనుమతించాలని తెలిపింది. 
 
 ఇదిలా ఉండగా,  పెద్ద నోట్ల రద్దుపై వచ్చిన పిటిషన్లు అన్నింటినీ డిసెంబర్ 2న విచారిస్తామని సుప్రీంకోర్టు  తెలిపింది. దీంతోపాటు వివిధ హైకోర్టుల్లో నోట్ల రద్దు చట్టబద్ధతపై పెండింగ్‌లో ఉన్న పిటిషన్లను కూడా విచారించేందుకు కోర్టు అంగీకరించింది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement