ఆలయంలోకి అఘోరాలు | Sakshi
Sakshi News home page

ఆలయంలోకి అఘోరాలు

Published Sun, Jul 16 2017 4:02 AM

ఆలయంలోకి అఘోరాలు - Sakshi

- చెన్నై శ్రీవారి గుడిలోకి ప్రవేశం
ఆగమశాస్త్రానికి విరుద్ధంగా తెచ్చారంటూ భక్తుల ఆందోళన 

సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా నగరంలోని శ్రీవారి ఆలయంలోకి అఘోరాల రాక వార్తలు తమిళనాట కలకలం రేపాయి. సంప్రోక్షణతో ఆలయాన్ని శుద్ధిచేసినట్లు సమాచారం. చెన్నై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాజీ సభ్యుడు సత్యనారా యణరావు, తమిళనాడు బీజేపీ ప్రోటోకాల్‌ ప్రతినిధి శంకర్‌ కలిసి శుక్రవారం నలుగురు అఘోరాలను శ్రీవారి ఆలయం సందర్శనకు తీసుకొ చ్చారు. వీరిలో ఒకరు పూర్తి నగ్నంగా ఉండగా మిగిలిన ముగ్గురు కొద్దిగా వస్త్రాలు ధరించారు. శ్రీవారి ఆలయ ఆగమ శాస్త్రాల ప్రకారం నగ్నస్వాముల దర్శనానికి అనుమతి లేదు.

స్థానిక సలహా మండలి చైర్మన్, వైస్‌చైర్మన్, ఇతర సభ్యులు శుక్రవారం రాత్రి రాజ్‌భవన్‌కు వెళ్లిన సమయంలో ఓ ప్రస్తుత సభ్యుడు, మరో మాజీ సభ్యుడు కలసి అఘోరాలకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించారు. సభ్యులే వెంటపెట్టుకుని రావడంతో ఆలయ నిబంధనలకు విరుద్ధమైనా అర్చకులు వారి పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దీంతో శ్రీవారి ఆలయం అపవిత్రమైందని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే ఆణివార ఆస్థాన కార్యక్రమంలో భాగంగా శ్రీవారి ఆలయ శుద్ధి కోసం శనివారం కొద్ది సేపు ఆలయాన్ని మూసివేశారు. అయితే ఆలయ మూసివేత ఏటా సహజంగా జరిగే ప్రక్రియని స్థానిక సలహా మండలి వివరణ ఇచ్చింది. ఆదివారం యథావిధిగా శ్రీవారి సేవలు సాగుతాయని చెప్పారు. మండలిలోని తెలుగుదేశం పార్టీ సభ్యులలో కొందరు వీరిని తీసుకొచ్చినట్లు సమాచారం. కాగా, అఘోరాల రాకతో భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement