ఆరు లక్షల రూపాయలు కట్టాల్సిందే!! | Sakshi
Sakshi News home page

ఆరు లక్షల రూపాయలు కట్టాల్సిందే!!

Published Thu, Aug 2 2018 5:07 PM

Akhilesh Yadav May Have To Pay 6 Lakh Rupees - Sakshi

లక్నో : ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌కు యూపీ సర్కారు షాక్‌ ఇచ్చింది. అధికారిక బంగ్లాను ఖాళీ చేసే సమయంలో తవ్వకాలు జరిపి నష్టం కలిగించినందుకుగానూ 6 లక్షల రూపాయలు చెల్లించాలంటూ నోటీసులు జారీ చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు జూన్‌ 2న అఖిలేశ్‌ యాదవ్‌ తన అధికారిక బంగ్లాను ఖాళీ చేసిన విషయం తెలిసిందే. అయితే బంగ్లాకు సంబంధించిన స్విమ్మింగ్‌ పూల్‌లోని టర్కిష్‌ టైల్స్‌తో పాటు, ఇటాలియన్‌ మార్బుల్‌, ఏసీలు, గార్డెన్‌ లైట్స్‌ మాయమమయవడంతో పాటు కొన్ని చోట్ల తవ్వకాలు జరపడంతో యూపీ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించి 200 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించడంతో యూపీ సర్కారు అఖిలేశ్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమైంది.

చదవండి : అఖిలేశ్‌ ఇలా కోపం తీర్చుకున్నారా...!?

Advertisement
Advertisement