'కన్న తల్లి కన్నా.. మాతృభూమి తక్కువేం కాదు' | Sakshi
Sakshi News home page

'కన్న తల్లి కన్నా.. మాతృభూమి తక్కువేం కాదు'

Published Sat, Apr 2 2016 7:31 PM

'కన్న తల్లి కన్నా.. మాతృభూమి తక్కువేం కాదు'

రాజ్ కోట్: ముస్లింలు ‘భారత్ మాతా కీ జై’ స్లోగన్ను పలుకొద్దంటూ దారుల్ ఉలూమ్ దేవ్‌బంద్ వర్సిటీ శుక్రవారం ఫత్వా జారీ చేయడం పై కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. మాతృ భూమి కోసం 'భారత్ మాతా కీ జై' అని నినదించడం ప్రతి ఒక్కరి హక్కని తెలిపారు. ఇది ఎన్నో భావోద్వోగాలతో ముడిపడి ఉన్న అంశం అని పేర్కొన్నారు. కన్న తల్లిలాంటి దేశం కోసం నినదించడం ప్రతి మనిషి హక్కు అని తెలిపారు. కన్న తల్లి కన్నా మాతృభూమి ఏమీ తక్కువ కాదని స్మృతి ఇరానీ పేర్కొన్నారు.

ముస్లింలు ‘భారత్ మాతా కీ జై’ అంటూ నినదించడంపై  దారుల్ ఉలూమ్ దేవ్‌బంద్ వర్సిటీ ఫత్వా జారీచేసిన విషయం తెలిసిందే. అలా నినదించడం విగ్రహారాధన కిందకు వస్తుందని, ఇస్లాం సూత్రాలకు విరుద్ధమని పేర్కొంది. ఆ నినాదాన్ని ఉచ్చరించబోమని వర్సిటీ పీఆర్‌ఓ అష్రాం ఉస్మానీ పేర్కొన్నారు. తామంతా దేశాన్ని ఎంతో ప్రేమిస్తున్నామని, ‘హిందుస్తాన్ జిందాబాద్’, ‘మద్రే వతన్’ అంటూ నినదిస్తామన్నారు. మనుషులు మాత్రమే మనుషులకు జన్మనివ్వగలరని, అలాంటప్పుడు దేశాన్ని తల్లిగా పేర్కొంటూ ఎలా నినాదాలిస్తారని ప్రశ్నించారు.  
 
భారత్ మాతా కీ జై ఉచ్చారణ మాతృభూమిపై ప్రేమావేశానికి నిదర్శనమని దీన్ని ప్రతి ఒక్కరు తప్పకుండా నినదించాలని ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించడంతో వివాదం మొదలైంది. ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఓవైసీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement