హైకోర్టుల్లో డిజిటల్‌ విప్లవం: జస్టిస్‌ లోకూర్‌ | Sakshi
Sakshi News home page

హైకోర్టుల్లో డిజిటల్‌ విప్లవం: జస్టిస్‌ లోకూర్‌

Published Sun, Oct 29 2017 4:05 AM

All high courts will go digital by year end: Justice Lokur - Sakshi

చెన్నై: ఈ ఏడాది చివరి నాటికి హైకోర్టులన్నీ డిజిటల్‌ బాట పడతాయని సుప్రీంకోర్టు ఈ–కమిటీ చైర్మన్‌ జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్‌ తెలిపారు. నాలుగు హైకోర్టులు ఇది వరకే తమ కార్యకలాపాలను పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వర్తిస్తున్నాయన్నారు. కోర్టు వ్యవహారాలను డిజిటల్‌ రూపంలోకి మార్చేందుకు ఉద్దేశించిన డేటా గ్రిడ్‌లో అన్ని హైకోర్టులు ఏడాది చివరి నాటికి చేరతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది న్యాయ వ్యవస్థలో సమూల మార్పులు వస్తాయన్నారు.

కేసులను ఆన్‌లైన్లోనే వేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని, స్టాంప్‌ పేపర్‌ను ఆన్‌లైలోనే కొనుగోలు చేయొచ్చన్నారు. వచ్చే వారం సరికొత్త మొబైల్‌ టెక్నాలజీని ప్రవేశపెట్టి యాప్‌ సేవలను అందించాలని ఈ–కమిటీ నిర్ణయించింది. ఈ అప్లికేషన్ల వాడకాన్ని వివరిస్తూ ఓ పుస్తకాన్ని కూడా తీసుకురావాలని కమిటీ ప్రణాళికలు రచిస్తోంది. ఈ యాప్‌ల ద్వారా లాయర్లు, కక్షిదారులు, జడ్జీలు కేసుల స్థితిగతులను ఆన్‌లైన్లోనే తెలుసుకోవచ్చని జస్టిస్‌ లోకూర్‌ వెల్లడించారు. 

Advertisement
Advertisement