ఈ ఏడాదికి జర్మన్ ను కొనసాగించండి: సుప్రీం | Sakshi
Sakshi News home page

ఈ ఏడాదికి జర్మన్ ను కొనసాగించండి: సుప్రీం

Published Fri, Nov 28 2014 2:00 PM

ఈ ఏడాదికి జర్మన్ ను కొనసాగించండి: సుప్రీం - Sakshi

న్యూఢిల్లీ: కేంద్రీయ విద్యాలయాల్లో జర్మన్ భాష కొనసాగింపుపై కేంద్రం పరిశీలన చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. దీనిపై వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని న్యాయస్థానం శుక్రవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్రీయ విద్యాలయాల్లో (కేవీ) మూడో భాషగా సంస్కృతాన్ని తప్పనిసరిచేస్తూ మానవ వనరుల శాఖ జారీచేసిన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై విద్యార్థులు తల్లిదండ్రులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

కేసు విచారణలో భాగంగా మూడో ప్రాధాన్య భాషగా జర్మనీ, గత ప్రభుత్వం చేసుకున్న అవగాహన ఒప్పందం చట్టవిరుద్ధమని అటార్నీ జనరల్ పేర్కొన్నారు. ఇకపై ఆ ఒప్పందాన్ని కొనసాగించలేమని తెలిపారు. అయితే ప్రభుత్వం చేస్తున్న తప్పులకు విద్యార్థులను ఎందుకు బలి చేయాలని న్యాయస్థానం ఈ సందర్భంగా ప్రశ్నించింది. జర్మన్ స్థానంలో సంస్కృతాన్ని ప్రవేశపెట్టడాన్నివచ్చే విద్యా సంవత్సరానికి వాయిదా వేయడంపై వివరణ ఇవ్వాలని సూచించింది.

కాగా కేంద్రీయ విద్యాలయాలలో గత కొన్నేళ్లుగా జర్మని భాషను ఒక సబ్జెక్టుగా బోధిస్తున్నారు. అందుకుగాను జర్మనికి చెందిన ఒక సంస్థతో ఆనాటి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.  ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే జర్మన్ భాషను తొలగించి, సంస్కృతాన్ని పెట్టాలని కేంద్రీయ విద్యాలయాలకు ఆదేశం ఇచ్చింది. విద్యా సంవత్సరం మధ్యలో ప్రభుత్వం ఆదేశాలతో జర్మన్ భాష అభ్యసించే విద్యార్థులకు షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో బాధితు విద్యార్థుల తల్లిదండ్రులు సుప్రీంకోర్టుకు వెళ్లారు.

Advertisement
Advertisement