Sakshi News home page

ఓబీసీ బిల్లుపై కాంగ్రెస్‌ వైఖరేంటి..?

Published Sun, Aug 5 2018 8:05 PM

Amit Shah Dares Congress To Clear Stand On OBC Bill - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఓబీసీ బిల్లుపై తమ పార్టీ వైఖరి వెల్లడించాలని బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా కాంగ్రెస్‌ను డిమాండ్‌ చేశారు. జాతీయ పౌరుల జాబితా (ఎన్‌ఆర్‌సీ) వ్యవహారంలో విపక్షం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఓబీసీ సవరణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొంది ప్రస్తుతం రాజ్యసభ ముందున్న విషయం తెలిసిందే.

జాతీయ ఎస్‌సీ, ఎస్‌టీ కమిషన్‌ తరహాలో జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించే దిశగా ఈ సవరణ చేపట్టారు. కాంగ్రెస్‌ పార్టీ ఓబీసీ బిల్లుపై తన వైఖరి వెల్లడిస్తే బీసీల ప్రయోజనాలపై ఆ పార్టీ చిత్తశుద్ధి ఏపాటిదో వెల్లడవుతుందని అమిత్‌ షా డిమాండ్‌ చేశారు.

ఎన్‌ఆర్‌సీ అంశంపై అమిత్‌ షా స్పందిస్తూ బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన వారిని తిప్పిపంపేందుకు తాము కట్టుబడిఉన్నామని స్పష్టం చేశారు. చొరబాటుదారులు దేశంలోనే ఉండాలని విపక్షాలు కోరుకుంటున్నాయా అని ప్రశ్నించారు.

Advertisement

What’s your opinion

Advertisement