కరోనా: ‘రిపోర్టులు వచ్చే వరకు ఆగొద్దు’ | Sakshi
Sakshi News home page

కరోనా: రిపోర్టులు వచ్చేవరకు ఆగొద్దు: అమిత్‌ షా

Published Mon, Jun 15 2020 11:27 AM

Amit Shah Orders Over Handing Bodies Of Suspected Corona Cases To Families - Sakshi

న్యూఢిల్లీ : ల్యాబ్‌ రిపోర్టులు వచ్చేంత వరకు ఆగకుండా ఢిల్లీలోని కరోనా వైరస్‌ అనుమానితుల మృతదేహాలను వారి బంధువులకు వెంటనే అప్పగించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా అధికారులను ఆదేశించారు. అయితే అంత్యక్రియలను మాత్రం ప్రభుత్వ గైడ్‌లైన్స్‌ ప్రకారం, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ నిర్వహించాలని స్పష్టం చేశారు. ఆదివారం ఢిల్లీలో కోవిడ్‌-19 విస్తరణపై ముఖ్యమంత్రి కేజ్రివాల్‌, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్, లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్, ఇతర అధికారులతో‌ ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించిన అమిత్‌ షా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. (24 గంటల్లో 11,502 పాజిటివ్‌ కేసులు)

కాగా, దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 40 వేల మార్కును దాటింది. నిన్న ఒక్కరోజే  దాదాపు  2,224 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 56 మంది మృత్యువాత పడ్డారు. ఇక దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 3,32,424కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 11,502 పాజిటివ్‌ కేసులు నమోదు అవ్వగా.. వైరస్‌ బారినపడి 325 మంది ప్రాణాలు కోల్పోయారు. (మహమ్మారిపై పోరు బాట)

Advertisement
Advertisement