తమిళనాడులో మ్యాగీ నిషేధం | Sakshi
Sakshi News home page

తమిళనాడులో మ్యాగీ నిషేధం

Published Thu, Jun 4 2015 7:45 PM

తమిళనాడులో మ్యాగీ నిషేధం - Sakshi

న్యూఢిల్లీ: హాని కల్గించే రసాయనాలు ఉన్నాయన్న కారణంతో  ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నిషేధం ఎదుర్కొంటున్న మ్యాగీ న్యూడుల్స్‌ కు  మరో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా  తమిళనాడు ప్రభుత్వం కూడా మ్యాగీ నూడుల్స్ పై మూడు నెలల పాటు నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు ఉత్తరాఖండ్‌లో మూడు నెలలు నిషేధం విధించగా, గుజరాత్, జమ్మూకశ్మీర్‌లలో ఒక నెల చొప్పున నిషేధం విధించాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని లేదని పరీక్షల్లో తేలిన తర్వాతే అనుమతిస్తామని స్పష్టంచేశాయి.

 

దీంతో పాటు బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు కూడా మ్యాగీపై చర్చలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నాయి.ఢిల్లీ ప్రభుత్వం బుధవారమే మ్యాగీ న్యూడుల్స్‌పై 15 రోజులపాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా నేపాల్ మ్యాగీ దిగుమతులపై నిషేధం విధించింది.
 

Advertisement
Advertisement