సిక్కిం బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఏఆర్‌ రెహ్మాన్‌

8 Jan, 2018 20:06 IST|Sakshi

గ్యాంగ్‌టక్‌: ఆస్కార్‌ అవార్డు గ్రహీత, ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహ్మాన్‌ను తమ రాష్ట్ర బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమిస్తూ సిక్కిం ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రాష్ట్రం చూడటానికే కాదు సాంస్కృతికంగా కూడా అందంగా ఉంటుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. రాష్ట్రంలో పర్యాటకుల సంఖ్య పెంపొందించేందుకు రెడ్‌ పాండా వింటర్‌ కార్నివాల్‌-2018ను నిర్వహించిన సందర్భంగా ఈ గౌరవం దక్కింది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్‌ చామ్లింగ్‌ రెహ్మాన్‌ను సత్కరించారు. 

మరిన్ని వార్తలు