‘రాహుల్‌కు అంత దమ్ము ఎక్కడిది?’ | Sakshi
Sakshi News home page

‘రాహుల్‌కు అంత దమ్ము ఎక్కడిది?’

Published Fri, Dec 16 2016 5:08 PM

‘రాహుల్‌కు అంత దమ్ము ఎక్కడిది?’ - Sakshi

ఢిల్లీ: మోదీ అవినీతిని బయటపెట్టే దమ్ము కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. ఒక వేళ బయటపెడితే వెంటనే మోదీ రాబర్ట్‌ వాద్రాను అరెస్టు చేస్తారని చెప్పారు.

అందుకే రాహుల్‌ గాంధీ మోదీకి తెగ భయపడిపోతున్నారని ఎద్దేవా చేశారు. రాహుల్‌ గాంధీ శుక్రవారం ఉదయం ప్రధాని నరేంద్రమోదీని కలిసిన విషయం తెలిసిందే. ఈ సమావేశం అనంతరం రాహుల్‌ పెద్దగా స్పందించకపోయిన నేపథ్యంలో కేజ్రీవాల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.


 

Advertisement
Advertisement