మనకు పెట్టుబడులు రావాలా.. వద్దా? | Sakshi
Sakshi News home page

మనకు పెట్టుబడులు రావాలా.. వద్దా?

Published Thu, Feb 26 2015 4:13 PM

మనకు పెట్టుబడులు రావాలా.. వద్దా?

కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న భూసేకరణ చట్టం సవరణ బిల్లును ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ గట్టిగా సమర్థించారు. ఈ బిల్లు విషయంలో ప్రతిపక్షాలు చర్చను పక్కదారి పట్టిస్తున్నాయని అన్నారు. రాజ్యసభలో ఈ విషయంపై మాట్లాడిన ఆయన సుధీర్ఘ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. జైట్లీ మాటల్లో కొన్ని ముఖ్యాంశాలు ఇవీ..

  • బిల్లు విషయంలో చర్చను పక్కదోవ పట్టిస్తున్నారు.
  • మన దేశంలోకి వచ్చే పెట్టుబడులను పక్క దేశాలకు వెళ్లనిద్దామా.. మన వద్దకు ఆహ్వానిద్దామా?
  • అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టులను ఏమాత్రం జాప్యం చేయకూడదు.
  • యూపీఏ తీసుకొచ్చిన భూచట్టం లోపభూయిష్టంగా ఉంది.. దానిని సవరించాలి.
  • మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు అనే మాటల్ని తప్పుడు పదాలుగా చిత్రించొద్దని కాంగ్రెస్కు విజ్ఞప్తి చేస్తున్నాను.
  • మీరు మాట్లాడేది చూస్తుంటే పరిశ్రమ అనే పదం చాలా చెడ్డది అనుకునే స్థాయికి మనం వెళ్లిపోతున్నామా అనిపిస్తుంది.
  • దేశానికి పరిశ్రమలను, మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం చాలామందిని వ్యవసాయ రంగం నుంచి తప్పించి తయారీ రంగంలో ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉంది.
  • ప్రస్తుతం ఉన్న చట్టంలో చేయబోయే సవరణలు 5 మాత్రమే..
  • విపక్షాలేమో రైతు వ్యతిరేక చర్యలు చేస్తున్నామని, పారిశ్రామిక వేత్తలకు మేలు చేస్తున్నామని ఆరోపిస్తున్నారు.. కానీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 30 వేల కోట్ల నష్టాన్ని చవిచూశాయి.
  • ప్రతిపక్షాలు సహకరించడం లేదు. జమ్ము కశ్మీర్ విషయంలో కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నాయి. దయచేసి ఆ ప్రాంతంపై కూడా మేం చేసే ఆలోచనను గౌరవించండి.

Advertisement
Advertisement