అంబులెన్స్‌కు దారి ఇచ్చినందుకు దౌర్జన్యం | Sakshi
Sakshi News home page

అంబులెన్స్‌కు దారి ఇచ్చినందుకు దౌర్జన్యం

Published Wed, Mar 4 2015 1:49 AM

attacks on an ambulance in a traffic

 బెంగళూరు: ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్స్‌ను పంపించేందుకు సహాయం చేసిన మాజీ సైనికుడి పై దౌర్జన్యం చేశాడో ట్రాఫిక్ ఎస్సై. ఈ సంఘటన మంగళవారం బెంగళూరులో జరిగింది. ఎస్సైని సస్పెండ్ చేశామని డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ప్యాలెస్ రోడ్డులో ట్రాఫిక్‌లో చిక్కుకున్న అత్యవసరంగా వెళ్తున్న అంబులెన్స్‌ను పంపించేందుకు నాగప్ప అనే మాజీ సైనికుడు రోడ్డుకు అడ్డంగా ఉన్న బారికేడ్‌ను తొలగించాడు. దాంతో మరో పక్క ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న ఎస్సై గంగన్న వచ్చి దుర్భాషలాడుతూ నాగప్పపై చేయి చేసుకున్నాడు. దీనిని లోకల్ చానెల్ ప్రసారం చేసింది.
 
 

Advertisement
Advertisement