రేపిస్టును చితక్కొడుతున్న మహిళలు | Sakshi
Sakshi News home page

రేపిస్టును చితక్కొడుతున్న మహిళలు

Published Tue, Jul 4 2017 5:35 PM

రేపిస్టును చితక్కొడుతున్న మహిళలు - Sakshi

న్యూఢిల్లీ: ఓ బాలికపై అత్యాచారం జరిపారన్న ఆరోపణపై ఓ యువకుని కాళ్లు, చేతులకు తాళ్లు కట్టి ఇద్దరు మహిళలు లాగుతుండగా, మరో ఇద్దరు మహిళలు పొడవాటి కర్రల పట్టుకొని కొడుతున్న వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ సంఘటన ఎప్పుడు, జరిగిందో, ఎక్కడ జరిగిందో తెలియడంలేదుగానీ భారత్‌లోనే జరిగినట్లు తెలుస్తోంది.

కొడుతున్న సేపు ఆ యువకుడు తప్పుచేసిన వాడిలాగా దెబ్బలు భరిస్తున్నాడే తప్ప ప్రతిఘటించేందుకు ప్రయత్నించలేదు. యువకుడి రేప్‌ కేసుకు సంబంధించిన వివరాలు కూడా ఇంత వరకు వెల్లడికాలేదు. ఓ పోలీసు సంఘటన స్థలానికి చేరుకొని గ్రామస్థులను విచారించడం కూడా ఆ వీడియోలో కనిపిస్తోంది. అప్పటికీ బాధిత యువకుడు కట్టేసి అలాగే పడి ఉన్నాడు. ఈ సంఘటనను ప్రత్యక్ష చూసిన వ్యక్తి ఎవరో ఓ వీడియోను ఆన్‌లైన్‌లో పోస్ట్‌ చేశాడే తప్ప దానికి సంబంధించిన వివరాలు వెల్లడించలేదు. 2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ కేసుతో కఠిన చట్టాలు తీసుకొచ్చినప్పటికీ భారత్‌లో అత్యాచార కేసులు తగ్గడం లేదు. 2014లో 14 వేల మంది పిల్లలపైనే అత్యాచారాలు జరిగాయి. 2015లో దేశవ్యాప్తంగా 34 వేల రేప్‌ కేసులు దాఖలయ్యాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement