రూ.15 లక్షలు గెలుచుకునే అవకాశం | Sakshi
Sakshi News home page

రూ.15 లక్షలు గెలుచుకునే అవకాశం

Published Wed, Nov 23 2016 11:24 AM

రూ.15 లక్షలు గెలుచుకునే అవకాశం

న్యూఢిల్లీ: బయోటెక్నాలజీ, మెడికల్‌ రంగాలకు సంబంధించి దైనందిన జీవితాల్లో ఎదురయ్యే సమస్యలకు పరిష్కార మార్గం చూపించే పరికరాన్ని తయారు చేశారా? బయో టెక్నాలజీ, మెడికల్‌ రంగాలకు సంబంధించి మీవద్ద సరికొత్త ఆలోచనలున్నాయా? అయితే ఇంకెందుకు ఆలస్యం! మీ ఆవిష్కరణలకు సంబంధించి డిసెంబరు 30 లోగా సృష్టి (సొసైటీ ఫర్‌ రీసెర్చ్‌ అండ్‌ ఇనిషియేటివ్స్‌ ఫర్‌ సస్టెయినబుల్‌ టెక్నాలజీస్‌ అండ్‌ ఇనిస్టిట్యూషన్‌), బిరాక్‌(బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్‌ అసిస్టెన్స్‌ కౌన్సిల్‌), జీటీ (గాంధీయన్‌ యంగ్‌ టెక్నాలాజికల్‌ ఇన్నోవేషన్‌)లకు దరఖాస్తు చేయండి.

ఈ రెండు సంస్థలు సంయుక్తంగా సైన్స్ అవార్డుల పేరిట రూ.15 లక్షలు గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. స్కూలు పిల్లలు దగ్గర నుంచి డాక్టరేట్‌ అందుకున్న వారి వరకు ఈ అవార్డుల్ని గెలుచుకునే అవకాశముంది. పోటీల్లో గెలుపొందిన విజేతలకు 2017 మార్చిలో రాష్ట్రపతి భవన్‌లో జరిగే కార్యక్రమంలో బహుమతులను ప్రదానం చేస్తారు. వివిధ కేటగిరీల కింద 15 మంది అభ్యర్థులు రూ.15 లక్షల మొత్తాన్ని (ఒక్కొక్కరికీ రూ. లక్ష చొప్పున) అందుకునే అవకాశముందని వీరితో పాటు 100 మంది క్షేత్రస్థాయి ఆవిష్కర్తలకు రూ. లక్ష గెలుచుకునే అవకాశముందని సృష్టి సంస్థ అధ్యక్షుడు అనిల్‌ కె. గుప్తా  మీడియాకు తెలిపారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement