బీటీఎస్ మద్దతు బీజేపీకే.. | Sakshi
Sakshi News home page

బీటీఎస్ మద్దతు బీజేపీకే..

Published Sun, Oct 5 2014 10:26 PM

bhiwandi telugu samajam support to bjp

సాక్షి, ముంబై: అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున బరిలో ఉన్న సంతోష్ ఎం. శెట్టి, మహేశ్ చౌగులేకు భివండీ పట్టణంలో భివండీ తెలుగు సమాజ్ (బీటీఎస్) బహిరంగంగా మద్దతు పలికింది. అఖిల పద్మశాలి సమాజ్ మంగళ కార్యాలయం లో ఆదివారం మధ్యాహ్నం బీటీఎస్ తరఫున బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజ్ అధ్యక్షుడు తుమ్మ రమేశ్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు వచ్చే శాసనసభ ఎన్నికల్లో తెలుగు ప్రజలు ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయమై చర్చించారు.

అనంతరం 136- పడమర భివండీ, 137- తూర్పు భివండీ నియోజక వర్గా ల్లో బీజేపీ తరఫున బరిలో ఉన్న మహేశ్ చౌగులే, సంతోష్ ఎం.శెట్టికి మద్దతు ప్రకటించా రు. ఈ సందర్భంగా సంతోష్ ఎం. శెట్టి మాట్లాడుతూ... గతంలో తనవల్ల తెలుగు ప్రజలకు ఏమైనా ఇబ్బందులు కలిగి ఉంటే క్షమించాలని కోరారు. ఆ మేరకు సమాజానికి క్షమాపణ పత్రా న్ని అందించారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో, అత్యధికంగా తెలుగు ప్రజలు స్థిరపడిన పద్మనగర్ ప్రాంతాల్లో ఐదు స్థానాలకు సమాజం ఎంపి క చేసిన అభ్యర్థులకు తన మద్దతు ఇస్తానని హామీ ఇచ్చారు. తెలుగు ప్రజల మద్దతు వల్లనే తాను 20 యేళ్లుగా రాజకీయాల్లో రాణిస్తున్నానన్నారు.

ఇప్పుడు కూడా సమాజం అండగా ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. మొట్ట మొదట తెలుగు ప్రజలు స్థిరపడ్డ పద్మనగర్, కామత్‌ఘర్, నయిబస్తీ, శ్రీరంగ నగర్ ప్రాంతాలను అభివృద్ది చేస్తానని తెలిపారు. అంతేగాకుండా తెలుగు ప్రజల కోసం ప్రత్యేకంగా డిగ్రీ కళాశాల, ఆస్పత్రి, ఆట స్థలం, స్కైవాక్, రోడ్ల నిర్మాణాలు చేపడతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో భివండీ తెలుగు సమాజ్ సంస్థాపకుడు నోముల శేఖర్, అధ్యక్షుడు తుమ్మ రమేశ్, డాక్టర్ సుంక శ్రీధర్, అఖిల పద్మశాలి సమాజ్ కార్యదర్శి దాసి అంబాదాస్, పద్మశాలి సమాజ్ యువక్ మం డలి అధ్యక్షుడు వడ్లకొండ రాము, డాక్టర్ పాము మనోహర్, మాజీ కార్పొరేటర్ కళ్యాడపు బాలకిషన్, శిక్షణ్ మండలి సభాపతి రాజు గాజుంగి, కము టం సుధాకర్, గాజెంగి కృష్ణ పాల్గొన్నారు.

Advertisement
Advertisement