బీహార్ వలస వధువులపై విచారణ | Sakshi
Sakshi News home page

బీహార్ వలస వధువులపై విచారణ

Published Tue, Jul 8 2014 3:35 PM

Bihar seeks data on girls sent to Haryana for marriage

పాట్నా: బీహార్ నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి హర్యానా అబ్బాయిలకు పెళ్లి చేస్తామన్న బీజేపీ నేత ఓపీ ధన్కడ్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. బీహార్ నుంచి హర్యానాకు ఎంతమంది అమ్మాయిలను తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నారన్నదానిపై సర్వే చేయాల్సిందిగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. నెల రోజుల లోపు నివేదిక ఇవ్వాల్సిందిగా 12 జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు.

అమ్మాయిలు ఇష్టపూర్వకంగా పెళ్లికి అంగీకరిస్తున్నారా లేక పెద్దలు డబ్బులకు ఆశపడి బలవంతంగా సాగనంపుతున్నారా అనే కోణంలో విచారణ చేయాల్సిందిగా బీహార్ ప్రభుత్వం సూచించింది. అమ్మాయిలను అమ్ముతున్నారని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఐజీ అరవింద్ పాండే చెప్పారు.

హర్యానాలో  అబ్బాయిలతో పోలీస్తే అమ్మాయిల సంఖ్య చాలా తక్కువ. దీంతో  పెళ్లికాని ప్రసాదుల సంఖ్య ఆ రాష్ట్రంలో పెరిగిపోతోంది. బీహార్లో అమ్మాయిలు ఎక్కువగా ఉండటంతో హర్యానా అబ్బాయిలు ఎదురుకట్నం ఇచ్చి అమ్మాయిలను తీసుకువచ్చి వివాహం చేసుకుంటున్నారు. తాజాగా బీజేపీ నేత ధన్ కడ్ వ్యాఖ్యలు ఈ సమస్య తీవ్రతను తెలియజేశాయి.

Advertisement
Advertisement