అమిత్ షా ర్యాలీకి కేఎంసీ అనుమతి | Sakshi
Sakshi News home page

అమిత్ షా ర్యాలీకి కేఎంసీ అనుమతి

Published Sat, Nov 29 2014 10:21 PM

BJP gets permission to hold Amit Shah's Kolkata rally

కోల్‌కతా: బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఆదివారం కోల్‌కతాలో నిర్వహించ తలపెట్టిన పార్టీ ర్యాలీకి కోల్‌కతా నగర పాలక సంస్థ (కేఎంసీ), అగ్నిమాపక శాఖ శనివారం అనుమతి ఇచ్చాయి.  అమిత్ షా ర్యాలీకి అనుమతి మంజూరు చేసినట్టు కేఎంసీ ‘మేయర్ ఇన్ కౌన్సిల్’ దేబాశీస్ కుమార్ చెప్పారు. ర్యాలీ నిర్వహణపై తమకు అభ్యంతరాల్లేవని పేర్కొంటూ కేఎంసీ, అగ్నిమాపక శాఖ పంపిన తమకు లేఖలు అందాయని బీజేపీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రశాఖ కార్యాలయ కార్యదర్శి అలోక్ గుహా రాయ్ చెప్పారు. ర్యాలీకి అనుమతి లభించడం బీజేపీ సాధించిన నైతిక విజయమని పార్టీ ప్రతినిధి రితే ష్ తివారీ వ్యాఖ్యానించారు.

 

ర్యాలీని అడ్డుకోవడానికి పశ్చిమ బెంగాల్ పాలకపక్షమైన తృణమూల్ కాంగ్రెస్ ప్రయత్నించిందన్న బీజేపీ ఆరోపణల నేపథ్యంలో తవారీ ఈ వ్యాఖ్య చేశారు. కాగా, ర్యాలీ జరగ నున్న స్థలాన్ని, హైకోర్టు నియమించిన ఇద్దరు ప్రత్యేక అధికారులు శనివారం పరిశీలించారు. ర్యాలీ జరిగేస్థలం, అగ్నిప్రమాద నిరోధక ఏర్పాట్లకు, మునిసిపల్ నిబంధనలకు అనుగుణంగా ఉన్నదా? అన్న విషయం వారు పరిశీలించారు.

 

Advertisement
Advertisement