దలైలామాకు భారత రత్న? | Sakshi
Sakshi News home page

దలైలామాకు భారత రత్న?

Published Sat, Apr 8 2017 6:41 PM

దలైలామాకు భారత రత్న?

తవాంగ్ : టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు భారత్ అత్యుత్తమ పురస్కారం భారత రత్నను ఇవ్వాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కోరుతోంది. దలైలామాకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సంతక సేకరణ క్యాంపెయిన్ ను కూడా ప్రారంభించింది. ఓ వైపు దలైలామా భారత్ పర్యటనకు చైనా తీవ్ర అభ్యంతరం చెబుతున్నా... ఆయన శుక్రవారం అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ చేరారు.  ఆయన రావడానికి ఒక్క రోజు ముందు అంటే ఏప్రిల్ 6న ఆర్ఎస్ఎస్ ఈ క్యాంపెయిన్ ను లాంచ్ చేసింది.
 
ఇప్పటికీ 5000 సంతకాలు సేకరించామని, 25వేల సంతకాలు పొందిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ వద్దకు ఈ అభ్యర్థనను తీసుకెళ్తామని ఆర్ఎస్ఎస్ చెబుతోంది. దలైలామాకు 1989లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. టెంపుల్టన్ ప్రైజ్-2012కి కూడా ఆయన ఎంపికయ్యారు. భారత రత్న పురస్కారం, నోబెల్ శాంతి బహుమతి కంటే భిన్నమైనదని, అంతర్జాతీయంగా మంచి మెసేజ్ ను అందించడానికి ఇది తోడ్పడుతుందని ఆర్ఎస్ఎస్ పేర్కొంది. దలైలామా భారతరత్నకు అర్హుడని, ఆయన భారత్ సంతతికి చెందిన వారని తెలిపింది.   

Advertisement
Advertisement