తెగతాగుతున్నారు! | Sakshi
Sakshi News home page

తెగతాగుతున్నారు!

Published Sun, Sep 23 2018 4:02 AM

Per capita alcohol consumption more than doubled in India from 2005 to 2016 - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో 2005తో పోల్చుకుంటే 2016 నాటికి మద్యం తలసరి వినియోగం రెట్టింపు అయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) తన నివేదికలో తెలిపింది. ఇండియాలో 2005లో ఆల్కహాల్‌ తలసరి వినియోగం 2.4 లీటర్లుగా ఉండగా, 2016 నాటికి అది 5.7 లీటర్లకు చేరుకుందని వెల్లడించింది. వీరిలో పురుషులు సరాసరి 4.2 లీటర్ల మద్యాన్ని తాగేస్తుండగా, మహిళలు 1.5 లీటర్ల మందును లాగించేస్తున్నారని పేర్కొంది.

2025 నాటికి ఆగ్నేయాసియాలో 15 ఏళ్లకు పైబడి మద్యం సేవించేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. అప్పటికల్లా భారత్‌లో తలసరి వినియోగం మరో 2.2 లీటర్లు పెరుగుతుందని వెల్లడించింది. ఇండోనేసియా, థాయ్‌లాండ్‌ దేశాల్లో మద్యం సేవించేవారి సంఖ్య స్వల్పంగా పెరుగుతుందంది. ఆగ్నేయాసియా తర్వాత పశ్చిమ పసిఫిక్‌ ప్రాంతంలో మద్యపాన సేవనం అధికంగా ఉంటుందని పేర్కొంది. 2005లో అంతర్జాతీయంగా తలసరి మద్యం వినియోగం 5.5 లీటర్లుగా ఉండగా, 2010 నాటికి అది 6.4 లీటర్లకు చేరుకుందనీ, 2016లో అదేస్థాయిలో కొనసాగుతోందని తెలిపింది.

Advertisement
Advertisement