Sakshi News home page

'అసలుది విడిచి.. కార్టూన్కే కంగారెందుకు?'

Published Fri, Jun 10 2016 1:02 PM

Cartoon of Rahul Hiding From Modi Removed by Karnataka Municipality

బెంగళూరు: రాహుల్ గాంధీని కించపరిచేలా ఉందని కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ పార్టీ ఓ కార్టూన్ను తొలగించింది. ముఖ్యంగా కుందపుర నియోజక వర్గంలో ఏ చోట కూడా ఈ కార్టూన్ లేకుండా తొలగించింది. ఇలాంటి కార్టూన్ వేయడం నేరం కిందకు వస్తుందని కూడా హెచ్చరించింది. ఇంతకీ ఆ కార్టూన్ ఎవరు గీశారు? అందులో ఏముంది అనే విషయం పరిశీలిస్తే..  సతీశ్ ఆచార్య అనే వ్యక్తి కార్టూనిస్టుగా పనిచేస్తున్నాడు. ఆయన కుందపురాలోని తన ఇంటి వద్ద నుంచే కార్టూన్లు వేస్తుంటాడు.

కార్టూన్ కార్నర్ పేరిట వేసే కార్టూన్లను ఆయా పార్టీలు తమకు నచ్చిన ప్రాంతాల్లో హోర్డింగ్లుగా ఏర్పాటుచేసుకుంటాయి. అందులో భాగంగానే ఆయన ఇటీవల రాహుల్ గాంధీ, సిద్ధ రామయ్య, ప్రధాని నరేంద్రమోదీ, కర్ణాటక మ్యాప్తో ఒక కార్టూన్ వేశారు. కాంగ్రెస్ రహిత భారత్ అంటూ దానికి పేరు పెట్టారు. అందులో మోదీ వేగంగా కర్ణాటక రాష్ట్రంపై అడుగుపెట్టి దూసుకొస్తుండగా సిద్ధ రామయ్య వెనుక రాహుల్ దాక్కొని నన్ను రక్షించండి సిద్ధ రామయ్యజీ అంటూ వ్యాఖ్య ఉండగా.. సిద్ధ రామయ్య కూడా అలాగే బెంబేలెత్తిపోతూ నన్ను రక్షించండి రాహుల్ జీ అంటూ వ్యాఖ్యానించినట్లుగా కార్టూన్ ఉంది.

ఈ కార్టూన్నే కర్ణాటకలో తొలగించారు. దీనిపై కార్టూనిస్టు సతీశ్ ఆచార్య వివరణ ఇస్తూ 'నేను అన్ని రాజకీయ పార్టీల కార్టూన్లు గీశాను. నాకు ఎవరూ సమస్యను సృష్టించలేదు. కానీ, ఈ కార్టూన్ పెట్టిన తర్వాత స్థానిక కాంగ్రెస్ నేత నన్ను పిలిచి దానిని తీసేయాలని లేదంటే నేరం అవతుందని చెప్పారు. ఆ మరుసటి రోజే అధికారులు దానిని తొలగించారు. తన ముందున్న సవాళ్ల గురించి కాంగ్రెస్ ఆందోళనకు గురికావాలి గానీ.. కార్టూన్ చూసి కాదు' అని ఆయన అన్నారు. ఈ విషయాన్ని తాను కాంగ్రెస్ అధిష్టానాన్ని సంప్రదించినా ఇంకా సమాధానం రాలేదని చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement