చండీగఢ్: ఏటీఎంలలో డ్రా చేసుకునే రూ.2000, రూ.4000లతో ఏం చేయలేకపోతున్నామని, వెంటనే నగదు ఉపసంహరణపై పరిమితి ఎత్తి వేయాలని పలు చోట్ల డిమాండ్లు వస్తున్నాయి. ప్రస్తుతం డబ్బు డ్రా చేసుకునే సమయాల్లో ఎలాంటి ఇబ్బందులు లేనందున డ్రా పరిమితి తొలగించాలని కోరుతున్నారు. ముఖ్యంగా చండీగఢ్ నుంచి బహిరంగంగా ఈ డిమాండ్ వినిపిస్తోంది.
పెద్ద నోట్ల రద్దు ప్రభావం కారణంగా తలెత్తిన డబ్బు సమస్య చండీగఢ్‌లో పూర్తి స్థాయిలో సర్దుమణిగింది. అక్కడ నోట్ల రద్దుకు ముందు ఉన్న పరిస్థితి మాదిరిగానే తాజా పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని ఆ ప్రాంత వాసులే చెబుతున్నారు. తమ వద్ద నోట్ల సమస్య తీరినందున ఏటీఎంలో ఉపసంహరణ చేసుకునే నగదు పరిమితి ఎత్తివేయాలని వారు కోరుతున్నారు. నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్రమోదీ దేశంలో సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
దాదాపు 86శాతం నోట్లను తిరిగి మార్పిడి చేశారు. అయితే, ఈ నిర్ణయం అమలులో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ దేశ ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయం అయినందున భరించారు. బ్యాంకుల వద్ద, ఏటీఎంల వద్ద తీవ్ర అగచాట్లు పడ్డారు. అయితే ప్రస్తుతం అన్ని ఏటీఎంలలో డబ్బు లభిస్తుండటం, పెద్దగా క్యూలు లేకపోవడంతో ఇక సాధారణ పరిస్థితులు ఏర్పడినందున ఉపసంహరణ నగదు పరిమితి ఎత్తివేస్తే బాగుంటుందని దేశ వ్యాప్తంగా పలు చోట్ల డిమాండ్ లు వస్తున్నాయి. ‘అదృష్టం కొద్ది పరిస్థితులు మారాయి. ప్రస్తుతం డబ్బు విత్ డ్రా చేసుకునే విషయంలో సమస్య రావడం లేదు.
అయితే, విత్ డ్రా చేసుకునే నగదు తక్కువే అయినందున వాటితో ఏ సమస్యలు తీరడం లేదు. అందుకే పరిమితి ఎత్తివేయాలి. రూ.2000, రూ.4000తో ఏం చేయగలం’ అంటూ దేవ్ అనే వ్యక్తి తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఇక హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న రాధిక అనే విద్యార్థిని స్పందిస్తూ ‘గతంలో మా అమ్మ వాళ్లు పంపించిన డబ్బులు సైతం విత్‌డ్రా చేసుకునేందుకు ఎంతో ఇబ్బంది అయ్యేది. కానీ,గత వారం నుంచి ఆ సమస్య లేదు. కాస్తంత ఒత్తిడి తగ్గింది. ఏ ఏటీఎం వద్దకు వెళ్లినా డబ్బు డ్రా చేసుకోగలుగుతున్నాం’ అని తెలిపింది.
రూ.2000, రూ.4000లతో ఏం చేయాలి?
Published Mon, Jan 9 2017 5:12 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్‌స్టాప్‌గా...
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement