మాజీ సీఎం ఇళ్లపై సీబీఐ దాడులు | Sakshi
Sakshi News home page

మాజీ సీఎం ఇళ్లపై సీబీఐ దాడులు

Published Sat, Sep 3 2016 10:55 AM

మాజీ సీఎం ఇళ్లపై సీబీఐ దాడులు - Sakshi

హర్యానా: హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ హుడా నివాసంపై సీబీఐ దాడులు నిర్వహించింది. ఏకకాలంలో ఆయనకు సంబంధించిన 20 నివాసాలు, కార్యాలయాలపై దాడులు కొనసాగించింది. దీంతోపాటు ఆయనతో సంబంధం ఉన్నట్లు తెలుస్తోన్న ఇద్దరు ఐపీఎస్ల నివాసాలపై కూడా సీబీఐ సోదాలు ప్రారంభించింది.

మానెసర్లోని ఓ భూకేటాయింపులకు సంబంధించి నాడు ముఖ్యమంత్రిగా ఉన్న హుడా భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఇందులో ఒక కేటాయింపునకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు కూడా సంబంధాలున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే సీబీఐ అధికారులు శనివారం దాడులు నిర్వహించింది. ఢిల్లీ, గుర్గావ్, చండీగఢ్లోని బంధువుల ఇళ్లల్లో కూడా సీబీఐ తనిఖీలు చేస్తోంది.

Advertisement
Advertisement