'ఇది ఆరోగ్యకర అభివృద్ధికి హానికరం' | Sakshi
Sakshi News home page

'ఇది ఆరోగ్యకర అభివృద్ధికి హానికరం'

Published Mon, Mar 16 2015 6:33 PM

central government budget favour to corporators

ఢిల్లీ:కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేటర్లకే అనుకూలంగా ఉందని టీఆర్ఎస్ ఎంపీ కవిత అభిప్రాయపడ్డారు. పేదలు, సగటు జీవి గురించి ఆ బడ్జెట్ లో ఆలోచన చేయలేదన్నారు.  సోమవారం లోక్ సభలో మాట్లాడిన ఆమె.. కార్పొరేటర్లకు 25 శాతం ట్యాక్స్ తగ్గించి వారికి అనుకూలంగా బడ్జెట్ ను ప్రవేశపెట్టారన్నారు. ఆర్థిక వృద్ధి రేటు 7.4 శాతం ఉందని కేంద్ర చెబుతున్నా.. ఆ లెక్కింపుపై అనేక విమర్శలు ఉన్నాయన్నారు. చైనాను అధిగమిస్తామన్న ఆర్థిక సర్వే రిపోర్ట్ వాస్తవ విరుద్ధంగా ఉందన్నారు.

 

అంగన్ వాడీ సంక్షేమానికి నిధులు తగ్గించారని ఈ సందర్భంగా కవిత సభ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో పాటు విద్య, వైద్యంపై నిర్లక్షం వహిస్తున్నారన్నారు. ఇది ఆరోగ్యకర సమాజ అభివృద్ధికి హానికరంగా మారే అవకాశం ఉందని కవితి తెలిపారు.

Advertisement
Advertisement