బాల... ఘటోత్కచులు | Sakshi
Sakshi News home page

బాల... ఘటోత్కచులు

Published Fri, Apr 17 2015 4:00 PM

బాల... ఘటోత్కచులు

గాంధీనగర్: అమ్మో! లావంటే లావూ కాదు...ప్రపంచంలోని పిల్లల కంటే లావు. పెద్దమ్మాయి పేరు యోగిత. వయస్సు ఐదేళ్లు. బరువు 34 కిలోలు. రెండో అమ్మాయి పేరు అనిష (ఫొటోలో కుడివైపు). మూడేళ్లు. బరువు 48 కిలోలు. కొడుకు పేరు హర్ష. 18 నెలలు. బరువు 15 కిలోలు.

వామ్మో.. వీరు తినే తిండి మోతాదు చూస్తే మనలాంటి వాళ్లకు కళ్లు తిరిగి ఒళ్లు తూలుతుంది. ఇద్దరమ్మాయిలు కలిసి రోజుకు 18 చపాతీలు, రెండున్నర కిలోల రైస్, రెండు బగోన్ల రసం, ఆరు క్రిస్ప్ ప్యాకెట్లు, ఐదు బిస్కట్ ప్యాకెట్లు, 12 అరటి పండ్లు, చెరొక లీటరు పాలు. పిల్లలకు ఇంత తిండి పెట్టి గున్న ఏనుగుల్లా తయారు చేస్తున్న వారి తల్లిదండ్రులను తిట్టాలనిపిస్తుంది. ఎప్పుడు తిండి యావ తప్ప మరో యావలేని ఈ పిల్లలకు తిను పదార్థాలు అందించడంలో క్షణమాత్రం ఆలస్యం చేసినా వారు ఇల్లుపీకి పందిరేస్తారు. అందుకోసం  తల్లిదండ్రుల పీక కూడా  పట్టుకుంటారు. కేవలం ఈ పిల్లల తిండి ఖర్చులే నెలకు 10వేల రూపాయు అవుతున్నాయిని తండ్రి, గుజరాత్‌కు చె ందిన రమేశ్ భాయ్ నంద్వానా వాపోతున్నాడు. పిల్లలకు వంట చేసి పెట్టడానికే తన జీవితం తెల్లారిపోతోందని తల్లి ప్రజ్ఞా బెన్ వాపోతున్నారు.
 పిల్లలు ఎందుకు విపరీతంగా తింటూ లావవుతున్నారో తెలుసుకునేందుకు ఈ తల్లిదండ్రులు గుజరాత్‌లోని పలు అస్పత్రులు తిరిగారు.జన్యుపరమైన జబ్బు ‘ప్రాడర్ విల్లీ సిండ్రోమ్ లేదా ఎండోక్రినికల్ డిసీస్’ అయి ఉంటుందని డాక్టర్లు చెప్పారట. అందుకు విరుగుడు ఏమిటో స్థానిక డాక్టర్లు చెప్పలేక పోతున్నారని, ఇప్పటికే వైద్యం కోసం యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టానని, ఇంతకుమించి ఖర్చుపెట్టే పరిస్థితి తనకు లేదని తండ్రి నంద్వానా వాపోతున్నాడు. తాను కూలినాలి చేస్తుంటే నెలకు మూడు, నాలుగువేల రూపాయలకు మించి సంపాదించలేక పోతున్నానని, ఇక వైద్యం ఏం చేయిస్తానని ఆ తండ్రి అంటున్నాడు. పిల్లల తిండి ఖర్చుకు అవుతున్న  పదివేల రూపాయలను ఇరుగుపొరుగు నుంచి చేబదులు, మిత్రుల నుంచి సహాయం ద్వారా సేకరిస్తున్నానని, అది కూడా కష్టమవుతుందని చెప్పాడు. పిల్లల్ని పోషించేందుకు, వారికి వైద్యం చేయించేందుకు కిడ్నీ అమ్మాలని నిర్ణయానికొచ్చానంటూ నంద్వానా కన్నీళ్లపర్యంతమయ్యాడు.
 

Advertisement
Advertisement