అక్కడ మీడియాకు స్వేచ్ఛ లేదు | Sakshi
Sakshi News home page

అక్కడ మీడియాకు స్వేచ్ఛ లేదు

Published Sat, Nov 4 2017 10:21 AM

China world's biggest prison for journalists - Sakshi

న్యూఢిల్లీ : ప్రజాస్వామ్యంలో నాలుగోస్థంభంగా చెప్పుకునే ప్రెస్‌కు.. చైనా అత్యంత ప్రమాదకర దేశమని తాజా నివేదిక స్పష్టం చేస్తోంది. వరల్డ్‌ ప్రెస్‌ ఫ్రీడమ్‌ ఇండెక్స్‌ 2017 నివేదిక.. చైనాలో జర్నలిస్టులు అత్యంత దారుణ పరిస్థితుల్లో ఉన్నట్లు స్పష్టం చేసింది. చైనాలో వందలాది మంది జర్నలిస్టులు జైళ్లలో మగ్గుతున్నట్లు నివేదిక ప్రకటించింది. చైనాలో మీడియాపై అత్యంత కఠినమైన ఆంక్షలు ఉన్నట్లు ప్రెస్‌ ఫ్రీడమ్‌ ఇండెక్స్‌ పేర్కొంది. ప్రెస్‌ ఫ్రీడమ్‌ ఇండెక్స్‌లో చైనాకు 176వ ర్యాంక్‌లో నిలిచింది. ఈ ఇండెక్స్‌ 180 దేశాల్లో సర్వే నిర్వహించగా.. చైనా తరువాత కంటే ఒకస్థానం ముందులో వియాత్నాం ఉంది. ఉత్తర కొరియాఇ 180వ స్థానంలో, సిరియా 177వ ర్యాంక్‌లో ఉన్నాయి.

భారత్‌లో ఫోర్త్‌ ఎస్టేట్‌గా చెప్పుకునే మీడియాకు ప్రెస్‌ ఫ్రీడమ్‌ ఇండెక్స్‌లో 136 ర్యాంక్‌ లభించింది. పొరుగునున్న పాకిస్తాన్‌ కంటే మనదేశంలో మీడియాకు స్వాతంత్రం ఎక్కువని ప్రెస్‌ ఇండెక్స్‌ తెలిపింది. పాకిస్తాన్‌లో జర్నలిస్టులపై అధికంగా హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయిన నివేదిక పేర్కొంది. ఇదిలా ఉండగా నార్వే, స్వీడన్‌, ఫిన్లాండ్‌, డెన్మార్క్‌, నెదర్లాండ్స్‌ దేశాలు వరుసగా టాప్‌ 5లో ఉన్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement