Sakshi News home page

వెంకయ్యతో ముఫ్తీ భేటీ

Published Wed, Apr 13 2016 11:45 AM

cm mehabooba meeting with venkaiah naidu

న్యూఢిల్లీ : ఎన్.ఐ.టి (నిట్) విద్యార్థుల సమస్యలు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ పరిశీలిస్తుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడుతో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం వెంకయ్యనాయుడు,ముఫ్తీ విలేకర్లతో మాట్లాడుతూ... ఇరువురి మధ్య శ్రీనగర్ ఎన్ఐటీ అంశం చర్చకు వచ్చినట్లు ఆయన తెలిపారు.

హెచ్సీయూ, జేఎన్యూ ఆ తర్వాత ఎన్ఐటీలో చోటు చేసుకున్న ఘటనలు... పరిణామాలతోపాటు ఆయా సమస్యల పరిష్కారంపై ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లు చెప్పారు. జమ్మూ కాశ్మీర్ నేపథ్యం  ప్రతిఒక్కరు గుర్తించుకోవాలన్నారు. అయితే ఈ సమస్యలను రాజకీయం చేయాలని ప్రతిపక్షాలు ఆలోచిస్తున్నాయని వెల్లడించారు. రాజకీయాలు చేయవద్దని ఈ సందర్భంగా ప్రతిపక్షాలకు వెంకయ్య హితవు పలికారు.

మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ.. స్థానికేతర విద్యార్థులందరికీ భద్రత కల్పిస్తామని ఆమె స్పష్టం చేశారు. వెంటనే తిరిగి రావాలని క్యాంపస్ నుంచి వెళ్లిన విద్యార్థులకు ఆమె సూచించారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement