1993 నుంచి బొగ్గు క్షేత్రాల కేటాయింపులు రద్దు! | Sakshi
Sakshi News home page

1993 నుంచి బొగ్గు క్షేత్రాల కేటాయింపులు రద్దు!

Published Mon, Aug 25 2014 3:34 PM

1993 నుంచి  బొగ్గు క్షేత్రాల కేటాయింపులు రద్దు! - Sakshi

న్యూఢిల్లీ: యుపిఏ ప్రభుత్వంలో భారీ కుంభకోణం జరిగినట్లు వివాదాలకు దారి తీసిన బొగ్గు క్షేత్రాల కేటాయింపులను సుప్రీం కోర్టు రద్దు చేసింది.  బొగ్గు క్షేత్రాలు కేటాయింపులో పారదర్శకతలేదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎం లోథా అధ్యక్షతన ఏర్పాటైన సుప్రీం కోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.  సుప్రీం కోర్టుల తీర్పుతో 1993 నుంచి 2010 వరకు కేటాయించిన బొగ్గు క్షేత్రాలు అన్నీ రద్దవుతాయి. కేసుపై మరింత విచారణ జరగవలసి ఉందని  సుప్రీం కోర్టు తెలిపింది.

ఈ బొగ్గు క్షేత్రాలను తిరిగి కేటాయించే అంశాలను పరిశీలించడానికి సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి అధ్యక్షతన ఒక కమిటీ వేయాలని ధర్మాసనం సలహా ఇచ్చింది. లైసెన్స్‌ల రద్దుపై సెప్టెంబర్‌ 1న సుప్రీం కోర్టు విచారణ చేపడుతుంది.

అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న యుపిఏ ప్రభుత్వం వేలం వేయకుండా ప్రైవేట్, పబ్లిక్ కంపెనీలకు బొగ్గు గనులను కట్టబెట్టడం వివాదాలకు దారి తీసింది. ఈ కేటాయింపుల వల్ల కేంద్రానికి భారీ నష్టం సంభవించింది. ఈ కుంభకోణం పలుసార్లు పార్లమెంటును కూడా కుదిపేసింది.

Advertisement
Advertisement