బొగ్గు స్కామ్‌లో 5 కొత్త కేసులు | Sakshi
Sakshi News home page

బొగ్గు స్కామ్‌లో 5 కొత్త కేసులు

Published Mon, Jul 6 2015 2:59 AM

బొగ్గు స్కామ్‌లో 5 కొత్త కేసులు - Sakshi

న్యూఢిల్లీ: బొగ్గు స్కాం విచారణలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) దేశంలోని వివిధ పరిశ్రమలపై కొత్తగా ఐదు మనీలాండరింగ్ కేసులు నమోదు చేసింది. మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన పరిశ్రమలపై ఈ కేసులు నమోదు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మనీలాండరింగ్ నిరోధక చట్టాన్ని అనుసరించి ఈడీ తాజాగా కేసులు పెట్టింది. వీటితో ఈడీ ఇప్పటివరకూ స్కాంలో 40 క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టయింది.

మనీలాండరింగ్ నిరోధక చట్టాలను అనుసరించి ఆయా పరిశ్రమల ఆస్తులను అటాచ్ చేయాలని కూడా ఈడీ ఆలోచిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. సీబీఐ ఇప్పటికే వీటిపై పలు ఐపీసీ సెక్షన్ల కింద, అవినీతి నిరోధక చట్టం కింద 48 కేసులు పెట్టింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement