తుది నిర్ణయూలు తీసుకోవద్దు | Sakshi
Sakshi News home page

తుది నిర్ణయూలు తీసుకోవద్దు

Published Sat, Sep 20 2014 2:21 AM

తుది నిర్ణయూలు తీసుకోవద్దు

కోల్‌గేట్ కేసులపై సీబీఐకి సుప్రీం ఆదేశం
 
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణానికి సంబంధించి ఉత్పన్నమయ్యే ఏ కేసు విషయంలోనూ ఎలాంటి తుది నిర్ణయం తీసుకోవద్దని సుప్రీంకోర్టు శుక్రవారం సీబీఐని ఆదేశించింది. ఈ కుంభకోణంలో నిందితులుగా ఉన్న కొందరిని రక్షించేందుకు ప్రయత్నించారంటూ సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హాపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ ఆదేశాలిచ్చింది. పన్ను చట్టాల ఉల్లంఘన ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద మాంసం ఎగుమతిదారు మెురుున్ ఖురేషీకి సంబంధించిన ఐటీ మదింపు నివేదికను అందజేయూల్సిందిగా చీఫ్ జస్టిస్ ఆర్.ఎం.లోధా నేతృత్వంలోని బెంచ్ కేంద్రాన్ని ఆదేశించింది.

ఖురేషీ పలుమార్లు సీబీఐ ఉన్నతాధికారిని ఆయన అధికార నివాసంలో కలుసుకున్నట్టుగా ఆరోపణలున్నారుు. ‘ఎలాంటి తొందరపాటు చర్యలూ తీసుకోవద్దు. తదుపరి విచారణలో బెంచ్ ఈ అంశాన్ని చేపట్టేవరకు ఆగండి. ఏ కేసు విషయంలోనూ తుది నిర్ణయం తీసుకోకండి..’ అని  ధర్మాసనం ఆదేశించింది. సీబీఐ డెరైక్టర్‌పై వచ్చిన ఆరోపణలపై కౌంటర్ దాఖలు చేయూల్సిందిగా అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీకి సూచించింది. తదుపరి విచారణను అక్టోబర్ 17వ తేదీకి వారుుదా వేసింది.
 

Advertisement
Advertisement