దసరా-మొహర్రం సందర్భంగా అల్లర్లు | Sakshi
Sakshi News home page

దసరా-మొహర్రం సందర్భంగా అల్లర్లు

Published Mon, Oct 2 2017 9:05 AM

Communal clashes in UP, Bihar, Jharkhand

సాక్షి, లక్నో/రాంచీ : దసరా, మొహర్రం పర్వదినాల సందర్భంగా జార్ఖండ్, ఉత్తర్‌ ప్రదేశ్‌, బీహార్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ అల్లర12 మందికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌ 30 దసరా పండుగ కావడం.. అదేవిధంగా అక్టోబర్‌ 1న మొహర్రం పర్వదినం రావడంతో.. ఇరు వర్గాల మధ్య ఊరేగింపు సందర్భంగా వచ్చిన వివాదాలతో ఘర్షణలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణల్లో ఎవరూ మరణించకున్నా.. 12 మంది గాయాలపాలయ్యారు.. అలాగే ఆరు వాహనాలు ధ్వంసం అయ్యాయి.

ఇరు వర్గాల మధ్య మొదట ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌ జిల్లాలోని పరం పుర్వ గ్రామంలో అల్లర్లు చెలరేగినట్లు అధికారులు గుర్తించారు. హిందువులు అధికంగా ఉండే ప్రాంతంలో.. మొహర్రం ఊరేగింపును ముస్లింలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో అక్కడ హిందువులు దసరా వేడుకలు నిర్వహించుకుంటున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అల్లరి మూకలు రాళ్లు రువ్వడంతో.. ఆరుగురికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. పోలీసులు జోక్యం చేసుకుని అల్లర్లను నియంత్రిణలోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు.

సాధారణంగా వెళ్లే దారిలో కాకుండా ఈ ఏడాది మొహర్రం ఊరేగింపుకు మరో దారిలో వెళ్లడంతో ఈ అల్లర్లు జరిగినట్లు పురం పుర్వ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (కాన్పూర్‌ జోన్‌) అలోక్‌ సింగ్‌ చెప్పారు. అల్లర్లు జరిగే అవకాశముందని తెలియడంతో.. ముందు జాగ్రత్తగా నాలుగు కంపెనీల ఆర్మ్‌డ్‌ కానిస్టేబుల్స్, ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ బలగాలను సిద్ధం చేసినట్లు ఆయన చెప్పారు. ఇటువంటి సంఘటనే ఇదే జిల్లాలోని రవత్‌పూర్‌, బలిలా, సికిందర్‌పూర్‌ ప్రాంతాల్లో జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనల్లో మరో ఆరుమందికి గాయాలు అయినట్లు పోలీసులు చెప్పారు.

బీహార్‌లోని జామై ప్రాంతంలో దుర్గా నవరాత్రి పూజలు నిర్వహిస్తున్నవారిపై కొందరు దుండగులు రాళ్లు రువ్వారు. జార్ఖండ్‌లోని జమ్‌షెడ్‌పూర్‌, రాంచీ, దల్తోన్‌గంజ్‌ ప్రాంతాల్లో ఇరను వర్గాల మధ్య ఘర్షణలు జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు.

Advertisement
Advertisement