కాంగ్రెస్‌ పార్టీకి విశ్వజిత్‌ రాణె గుడ్‌బై | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ పార్టీకి విశ్వజిత్‌ రాణె గుడ్‌బై

Published Thu, Mar 16 2017 1:25 PM

కాంగ్రెస్‌ పార్టీకి విశ్వజిత్‌ రాణె గుడ్‌బై - Sakshi

గోవా: ఎమ్మెల్యే విశ్వజిత్‌ రాణె కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పారు. కాంగ్రెస్‌ హైకమాండ్‌ తీరును నిరసిస్తున్న ఆయన గురువారం పార్టీకి రాజీనామా చేశారు. గోవాలో బీజేపీ కన్నా మెజార్టీ వచ్చినప్పటికీ హైకమాండ్‌ నిర్లక్ష్యం వల్లే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయామని విశ్వజిత్‌ వ్యాఖ్యానించారు. అలాగే గోవా ప్రజల తీర్పును తాము అనుకూలంగా మార్చుకోలేకపోయామని అన్నారు. మరోవైపు గోవా అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షకు విశ్వజిత్‌ రాణే గైర్హాజరు అయ్యారు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో వాల్పోయి నుంచి విశ్వజిత్‌  ఎమ్మెల్యేగా గెలుపొందారు.

కాగా 40 స్థానాలున్న గోవాలో కాంగ్రెస్ 17 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రోహన్ కాంటె కూడా కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. గోవాలో అధికార బీజేపీ 13 సీట్లకే పరిమితం కాగా ఇతరులు 10 సీట్లు గెల్చుకున్నారు. అయితే బీజేపీకి చిన్నాచితక పార్టీల ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీకి ఎమ్మెల్యేల బలం 22కు పెరిగింది. దీంతో మనోహర్ పారికర్ గోవా ముఖ్యమంత్రిగా మంగళవారం ప్రమాణంచేసి, ఇవాళ విశ్వాస పరీక్షలో నెగ్గారు. ఆయనకు అనుకూలంగా 22 ఓట్లు, వ్యతిరేకంగా 16 ఓట్లు వచ్చాయి.

Advertisement
Advertisement