రాజ్యాంగం పవిత్ర గ్రంథం: రాష్ట్రపతి

27 Nov, 2018 05:08 IST|Sakshi
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సోమవారం నాగ్‌పూర్‌లో డాక్టర్‌.బీఆర్‌ అంబేడ్కర్‌ చిత్రపటాన్ని పల్లకీలో ఊరేగిస్తున్న మహిళలు

న్యూఢిల్లీ: రాజ్యాంగం ఇచ్చే సలహాలు, సూచనలను పెడచెవిన పెడితే.. తీవ్ర భిన్నాభిప్రాయానికి, గందరగోళానికి దారితీస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజయ్‌ గొగోయ్‌ హెచ్చరించారు. రాజ్యాంగాన్ని పాటించడం దేశ ప్రయోజనాలకు మంచిదన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన ‘కాన్‌స్టిట్యూషన్‌డే సెలబ్రేషన్స్‌’లో సోమవారం ఆయన పాల్గొన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాని మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్వతంత్ర భారతదేశ ఆధునిక పవిత్ర గ్రంధం అని రాజ్యాంగాన్ని రాష్ట్రపతి అభివర్ణించారు. వ్యక్తిగత, ప్రజా జీవితాల్లో రాజ్యాంగ ప్రవచిత అంశాలను విధిగా పాటించాలన్నారు. రాజ్యాంగం బోధించే విలువలకు కట్టుబడి ఉంటామని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు.
 

మరిన్ని వార్తలు