విద్యార్థినిలో కరోనా లక్షణాలు | Sakshi
Sakshi News home page

విద్యార్థినిలో కరోనా లక్షణాలు

Published Mon, Feb 3 2020 1:20 PM

Corona Virus Symptoms in Odisha Medical Student - Sakshi

ఒడిశా,భువనేశ్వర్‌: రాష్ట్రంలో కరోనా భయం బెంబేలెత్తిస్తుంది. తాజాగా చైనా నుంచి వచ్చిన మరో వైద్య విద్యార్థిలో ఈ వైరస్‌ ఛాయల్ని గుర్తించారు. రాష్ట్రానికి చెందిన యువతి చైనాలో వైద్య విద్య అభ్యసిస్తుంది. కరోనా భయంతో స్వదేశానికి తిరిగి రాగా.. ఆమెలో అనారోగ్య పరిస్థితులను గమనించి.. సందిగ్ధ పరిస్థితుల్లో కటక్‌ ఎస్సీబీ మెడికల్‌ కళాశాల ఆస్పత్రిలో చేర్పి ంచారు. స్థానిక బిజూ పట్నాయక్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో మౌలిక పరీక్షలు నిర్వహించి, కటక్‌ ఎస్సీబీ మెడికల్‌ కళాశాల ఆస్పత్రికి తరలించారు. కాగా.. రాష్ట్రంలోని మరో ఐదుగురికి సందిగ్ధ కరోనా వైరస్‌ బాధితుల్లో ఈ ఛాయలు లేనట్లు ఉన్నత స్థాయి పరీక్షలు స్పష్టంచేశాయి. ఇటీవల రాష్ట్రం నుంచి ఐదుగురు కరోనా అనుమానంతో పరీక్షల కోసం పూణే జాతీయ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ(ఎన్‌ఐవీ)కి స్థానిక ప్రాంతీయ వైద్య పరిశోధన సంస్థ(ఆర్‌ఎంఆర్‌సీ) సిఫారసు చేసింది.

ఈ సంస్థ సమర్పించిన నివేదిక ప్రకారం వారికి వ్యాధి లేనట్లు నిర్ధారించారు. చైనాలో వైద్య విద్యాభ్యాసం చేసి తిరిగి వచ్చిన ఫుల్బాణి వ్యక్తి నమూనా పరీక్షల నివేదిక ఇంతవరకు చేరనట్లు అధికార వర్గాలు తెలిపారు. దీంతో నివేదిక పట్ల సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

Advertisement
Advertisement