మాస్క్‌ ధరించకుంటే రూ. 200 ఫైన్‌

9 Apr, 2020 18:52 IST|Sakshi

భువనేశ్వర్‌ : కరోనా వైరస్‌ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే ఒడిశాలో లాక్‌డౌన్‌ను ఏప్రిల్‌ 30 వరకు పొడిగిస్తూ ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో దేశంలో లాక్‌డౌన్‌ను పొడగించిన మొదటి రాష్ట్రంగా ఒడిశా నిలిచింది. తాజాగా ఇళ్ల నుంచి బయటకు వచ్చే ప్రజలు మాస్కులు ధరించడం తప్పనిసరి చేశారు. ఒకవేళ ఎవరైనా మాస్క్‌ ధరించకుంటే రూ. 200 జరిమానా విధించనున్నట్టు తెలిపింది. మాస్క్‌ ధరించే నిబంధనను ఉల్లంఘించినవారికి మొదటి మూడుసార్లు రూ. 200, ఆపైన ఎన్నిసార్లు నిబంధన ఉల్లంఘిస్తే అన్నిసార్లు రూ. 500 జరిమానా విధించనున్నారు.

కాగా, ఇప్పటికే పలు రాష్ట్రాలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లేవారు మాస్క్‌ ధరించడం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఒడిశా ప్రభుత్వం కరోనా వైరస్‌ కట్టడిలో ముందు వరుసలో ఉందనే చెప్పాలి. రాష్ట్రంలో గురువారం సాయంత్రం 5 గంటల వరకు 42 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 5865 కరోనా కేసులు నమోదుకాగా, 169 మంది మృతిచెందినట్టుగా కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. 

చదవండి : లాక్‌డౌన్‌: ఒడిశా కీలక నిర్ణయం

అష్ట దిగ్బంధంలోకి ఆ 15 ప్రాంతాలు..

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు