అపరిమిత వైద్య ఖర్చులపై ఏం చేశారు? | Sakshi
Sakshi News home page

అపరిమిత వైద్య ఖర్చులపై ఏం చేశారు?

Published Fri, Mar 9 2018 3:34 AM

Cost of medical treatment exorbitant, govt has to do something: - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో పెరుగుతున్న అపరిమిత వైద్య ఖర్చుల విషయంలో ఏవైనా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. వైద్యానికి అయ్యే అంత ఖర్చును భరించలేక ప్రజలు సరైన చికిత్సకు నోచుకోలేక పోతున్నారని ఆవేదనవ్యక్తం చేసింది. ఢిల్లీలోని నాలుగు ఆస్పత్రుల్లో నాన్‌ షెడ్యూల్డ్‌ మందులు, డయాగ్నస్టిక్స్‌ సేవలకు విపరీతమైన ధరలు ఉన్నాయని జాతీయ ఔషధ ధరల ప్రాధికార సంస్థ (ఎన్‌పీపీఏ) ఓ నివేదికలో పేర్కొంది. అడ్రినార్‌ అనే 2మిల్లీలీటర్ల ఇంజెక్షన్‌కు రిటైల్‌ ధర రూ. 189.95 ఉందని, అదే ఆస్పత్రులకు మాత్రం రూ.14.7కే వస్తోందని, అయితే రోగులకు పన్నులతో కలుపుకొని రూ.5,318కి అమ్ముతున్నట్లు తేలింది.

Advertisement
Advertisement