Sakshi News home page

గ్యాంగ్ రేప్ కేసులో ఐదుగురికి ఉరి

Published Tue, Nov 24 2015 8:23 AM

Court Sentences Five to Death for Gang Rape and Murder of Minor

భువనేశ్వర్ :  ఒడిశాలోని జిల్లా సెషన్స్ కోర్టు  సంచలన తీర్చు వెలువరించింది.  మైనర్ బాలికపై  సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ అయిదుగురి వ్యక్తులకు   ఉరిశిక్షను ఖరారు చేస్తూ సోమవారం తీర్పు చెప్పింది. స్థానికంగా సంచలనం రేపిన ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాటా ముండా, మంగల్ ప్రుస్తి, జతేన్ ముండా, హజ్రిత్ సింగ్ , బిశ్వనాథ్ ముండా లను కోర్టు దోషులుగా తేల్చింది.  బాలిక పట్ల అమానుషంగా ప్రవర్తించినవారికి  మరణదండనే సరైనదని వ్యాఖ్యానించింది.   ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఇద్దరు  ఇప్పటికీ  పరారీలోనే ఉన్నారు.


కాగా 2012  ఆగస్టులో బేలాకుండి  బార్బిల్ గ్రామానికి చెందిన  ఎనిమిదవ తరగతి విద్యార్థినిని ఎత్తుకెళ్లిన  ఏడుగురు వ్యక్తులు  సామూహిక అత్యాచారం చేసి అనంతరం హత్య చేశారు.   ప్రైవేటుకు వెళ్లిన  కూతురు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు  పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఆ మరునాడు స్థానిక అటవీ ప్రాంతంలో బాలిక  మృతదేహాన్ని  కనుగొన్నారు.  అయితే  కింది కోర్టు  తీర్పును హైకోర్టులో సవాల్ చేయనున్నట్లు నిందితుల తరపు న్యాయవాది తెలిపారు.

 

Advertisement

What’s your opinion

Advertisement