కన్నకూతుర్ని కడతేర్చిన రైతు | Sakshi
Sakshi News home page

కన్నకూతుర్ని కడతేర్చిన రైతు

Published Mon, Aug 1 2016 8:31 AM

కన్నకూతుర్ని కడతేర్చిన రైతు - Sakshi

ఛండీగఢ్‌: అప్పులు పాలైన రైతు కన్నకూతుర్ని కర్కకశంగా హత్య చేసిన ఘటన హర్యానాలోని రెవారి జిల్లా బెరంపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. కూతురు పెళ్లి చేయలేమోనన్న భయంతో అన్నదాత తన 15 ఏళ్ల కుమార్తెను కడతెర్చాడు. నిందితుడు మహీందర్ సింగ్ పరారీలో ఉన్నాడు. శనివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న కుమార్తె సంజును గొడ్డలితో నరికి చంపాడు. మహీందర్ భార్య, అతడి ఇద్దరు కుమారులు ఇంట్లో లేకపోవడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.


ఆదివారం పొరుగింటామె మహీందర్ ఇంటికి వెళ్లి చూడడంతో ఈ దారుణోదంతం వెలుగు చూసింది. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన మహీందర్ కూతురు పెళ్లి చేయలేమోనన్న భయంతో ఈ కిరాతకానికి పాల్పడివుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడిని అరెస్ట్ చేస్తే కాని అసలు విషయం తెలియదని దర్యాప్తు అధికారి నరీందర్ సింగ్ అన్నారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement