రెండు తెలుగు రాష్ట్రాలపై నిర్ణయాలు | Sakshi
Sakshi News home page

రెండు తెలుగు రాష్ట్రాలపై నిర్ణయాలు

Published Thu, Apr 9 2015 10:24 PM

వెంకయ్య నాయుడు - Sakshi

న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలలో మౌలిక సదుపాయాలపై  కేంద్ర పట్టణాభివృద్ధిశాఖమంత్రి వెంకయ్య నాయుడు ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఇక నుంచి రెండు రాష్ట్రాలకు వేరువేరుగా ఢిల్లీకి రైల్వే సర్వీసులు చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చే ఏపీ ఎక్స్ప్రెస్ పేరుని తెలంగాణ ఎక్స్ప్రెస్గా మార్పు చేశారు. వైజాగ్ నుంచి న్యూఢిల్లీకి కొత్తగా రైలు సర్వీసు కల్పించనున్నారు. దానికి ఏపీ ఎక్స్ప్రెస్గా పేరు ఖరారు చేశారు. సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్ నగర్ వెళ్లే తెలంగాణ ఎక్స్ప్రెస్ పేరును కొమరంభీమ్ ఎక్స్ప్రెస్గా మార్పు చేశారు.

తిరుపతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు మేలో సన్మాహాలు మొదలుపెట్టనున్నట్లు మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. హుద్హుద్తో దెబ్బతిన్న వైజాగ్ విమానాశ్రయం మరమ్మతులు ఈ నెలలో  పూర్తి అయ్యే అవకాశం ఉందన్నారు. విశాఖకు కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభును వెంకయ్య కోరారు.

Advertisement
Advertisement