ఢిల్లీ ఏసీబీ చేతికి 'సీఎన్ జీ' స్కాం కేసు | Sakshi
Sakshi News home page

ఢిల్లీ ఏసీబీ చేతికి 'సీఎన్ జీ' స్కాం కేసు

Published Sat, Jun 6 2015 5:12 PM

ఢిల్లీ ఏసీబీ చేతికి 'సీఎన్ జీ' స్కాం కేసు

న్యూఢిల్లీ: ఢిల్లీ అవినీతి నిరోధకశాఖ సీఎన్జీ కుంభకోణం కేసుని రీ ఓపెన్ చేసింది. 2002లో సీఎన్జీ గ్యాస్ సిలిండర్ల వ్యవహారంలో రూ.100 కోట్ల కుంభకోణం జరిగిందని 2012లో న్యూఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వ హయాంలో ఏసీబీ శాఖ కేసు నమోదుచేసింది. అయితే అప్పటి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్ సహా ఆమె ప్రభుత్వంలో పనిచేసిన కొందరు మంత్రులు, అధికారులుల అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలున్నాయి.

ఆమ్ ఆద్మీ పార్టీ 49 రోజుల ప్రభుత్వ పాలన ముగిసిన అనంతరం.. తాను ఈ కేసుకు సంబంధించిన అన్ని సర్టిఫికెట్లను, ఇతరత్రా పత్రాలను దర్యాప్తు నిమిత్తం సమర్పించాలని ఏసీబీ అధికారులు కోరారని కేజ్రీవాల్ వెల్లడించారు. ఢిల్లీలో కేజ్రీవాల్ రాజీనామా చేయడంతో ఈ కేసు విచారణలో జాప్యం జరిగింది.  ప్రస్తుతం అక్కడ ఆప్ సర్కారు మళ్లీ అధికారంలోకి రావడంతో ఏసీబీ దర్యాప్తు ప్రారంభించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement